Aravind Kejriwal Custody: అరవింద్ కేజ్రీవాల్ ను 6 రోజుల పాటూ ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పు, ఈ నెల 28న మళ్లీ హాజరుపరచాలని ఆదేశం
దీంతో ఈ నెల 28 వరకు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి (ED Custody) తీసుకుని విచారించనుంది.
New Delhi, March 22: లిక్కర్ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు (Kejriwal) రౌస్ అవెన్యూ కోర్టు ఆరు రోజుల కస్టడీ విధించింది. దీంతో ఈ నెల 28 వరకు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి (ED Custody) తీసుకుని విచారించనుంది. ఢిల్లీ మద్యం పాలసీకి (Liquor Policy Case) సంబంధించి విచారణ నిమిత్తం గురువారం నాడు కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులు.. రాత్రి వరకు విచారణ జరిపి ఆయన్ను అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను (Kejriwal) హాజరుపరిచారు.
ఈ సందర్భంగా విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌ను 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరింది. కాగా, ఆరు రోజుల కస్టడీకే కోర్టు అనుమతించింది. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.