Delhi: ఢిల్లీలో 9 ఏళ్ళ బాలికపై తెగబడిన కామాంధులు, దారుణంగా అత్యాచారం చేసి ఆపై హత్య, ఘటనపై విచారణకు ఆదేశించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం
9 ఏళ్ల మైనర్ బాలికపై కొందరువ్యక్తులు సామూహిక అత్యాచారం ( Delhi gang rape and murder) చేసి హత్య చేసిన ఘటన ఇప్పుడు దేశ రాజధానిలో ప్రకంపనలు పుట్టిస్తోంది. బాలిక తల్లిదండ్రుల అనుమతి లేకుండానే రాత్రికి రాత్రే అంత్యక్రియలు పూర్తి చేయడంతో ఇది ఇంకా ఆగ్రహ జ్వాలలను రప్పిస్తోంది.
New Delhi, August 4: దేశ రాజధాని ఢిల్లీలో గత ఆదివారం 9 ఏళ్ల మైనర్ బాలిక దారుణంగా అత్యాచారం, హత్యకు గురైంది. మైనర్ బాలికపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారం ( Delhi gang rape and murder) చేసి హత్య చేసిన ఘటన ఇప్పుడు దేశ రాజధానిలో ప్రకంపనలు పుట్టిస్తోంది. బాలిక తల్లిదండ్రుల అనుమతి లేకుండానే రాత్రికి రాత్రే అంత్యక్రియలు పూర్తి చేయడంతో ఇది ఇంకా ఆగ్రహ జ్వాలలను రప్పిస్తోంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహానికి గురైన దాదాపు 200 మంది స్థానికులు భారీ నిరసనకు దిగారు.
సీసీటీవీ పుటేజీని పరిశీలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.కాటి కాపరితోపాటు, శ్మశాన వాటికలో పనిచేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు డీసీపీ ఇంగిత్ ప్రతాప్‌సింగ్ ప్రకటించారు.ఫోరెన్సిక్ సైన్స్ లాబ్ అధికారులు క్రైమ్ బృందం దర్యాప్తు కోసం నమూనాలను సేకరించారని దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. మరోవైపు బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని ఢిల్లీ సీఎం (Delhi CM Arvind Kejriwal) ప్రకటించారు.
ఈ ఘటనపై వెంటనే విచారణ ( orders magisterial probe into alleged rape and murder) జరపాలంటూ ఢిల్లీ సీఎం ఆదేశించారు. అమ్మాయి కుటుంబాన్ని కలుసుకుని వారి బాధను పంచుకున్నాం. ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ .10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుంది. ఈ విషయంపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు జారీ చేశాం. దోషులను శిక్షించడానికి న్యాయవాదులు నిమగ్నమై ఉన్నారు. ఢిల్లీలో శాంతిభద్రతలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి, దానికి మేము పూర్తిగా సహకరిస్తాము అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
Here's Delhi CM Tweet
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. ఢిల్లీ కంటోన్మెంట్ పరిధిలోని శ్మశానవాటికు సమీపంలో మోహన్ లాల్, సునీతా దేవి దంపతులు ఇంట్లో నివసిస్తున్నారు. వీరి కుమార్తె బాలిక శ్మశాన ప్రాంగణంలోకి వెళుతూ వుంటుంది. అలాగే ఫ్రిజ్‌లో నీళ్లు తాగేందుకు ఆదివారం సాయంత్రం కూడా వెళ్లింది. ఆ తరువాతనుంచి కనిపించకుండా పోయింది. కుమార్తెకోసం వెదుకుతున్న తల్లి అక్కడికెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. దీంతో ఫ్రిజ్ వాటర్ తాగుతున్న సమయంలో బాలిక విద్యుత్ షాక్‌కి గురై చనిపోయిందని కాటి కాపరి, అక్కడే పనిచేసే మరో ముగ్గురు సిబ్బంది నమ్మ బలికారు. అంతేకాదు పోస్టుమార్టం పేరుతో భయపెట్టి, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని బెదిరించారు.
పోలీసులు అమ్మాయి అవయవాలను అమ్ముకుంటారంటూ కల్లబొల్లి మాటలతో మభ‍్య పెట్టారు. కుటుంబ సభ్యులంతా ఈ అమోమయంలో ఉండగానే హడావిడిగా బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో బాలిక శరీరంపై పలుచోట్ల గాయాలను గమనించిన తల్లిదండ్రులకు తమ అనుమానం మరింత బలపడింది. చివరకు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుమార్తెను అత్యాచారం చేసి చంపేసారంటూ కాటి కాపరి సహా నలుగురిపై ఆరోపణలు నమోదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు కాటి కాపరి రాధేశ్యామ్, సలీమ్, లక్ష్మీ నారాయణ్, కుల్దీప్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
Here's ANI Tweet
అత్యాచారం, హత్యకు ( Molest and Murder ) గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ పరామర్శించారు. ఉదయాన్నే బాధితురాలి ఇంటి వెళ్లిన రాహుల్‌గాంధీ.. ఆమె కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ కేసు విషయంలో న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాధితురాలు కేవలం ఆ కుటుంబానికి మాత్రమే ఆడబిడ్డ కాదని, ఈ దేశానికి చెందిన ఆడబిడ్డ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్‌గాంధీ.. బాధితురాలు కుటుంబంతో మాట్లాడాను. వారు ఈ కేసులో న్యాయం జరుగాలని కోరుకుంటున్నారు. అంతకుమించి వారు ఇంకేం ఆశించడం లేదు. వారికి సాయం కావాలి. మేం ఆ సాయం చేస్తాం. ఆ కుటుంబానికి అండగా నిలబడుతాం. న్యాయం జరిగే వరకు రాహుల్‌గాంధీ ఆ కుటుంబానికి అండగా ఉంటాడు అని ఆయన హామీ ఇచ్చారు.