Delhi CM Rekha Gupta Oath: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. సిద్ధమైన రాంలీలా మైదానం, రేఖా గుప్తాతో పాటు ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం, వివరాలివే

ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు రేఖా గుప్తా . మధ్యాహ్నం 12:35కి రాంలీలా మైదానంలో ప్రమాణస్వీకారం జరగనుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు.

Delhi CM Rekha Gupta Oath Ceremony Updates, here are the minister details!(X)

Delhi, Feb 20: ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు రేఖా గుప్తా( Delhi CM Rekha Gupta Oath). మధ్యాహ్నం 12:35కి రాంలీలా మైదానంలో ప్రమాణస్వీకారం జరగనుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. అలాగే ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు సైతం ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.

రేఖా గుప్తాతో(CM Rekha Gupta) పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనుండగా ఓవరాల్‌గా ఢిల్లీ నాలుగో సీఎం రేఖా గుప్తా. 30 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయగా రామ్‌లీలామైదానంలో SPG భద్రతను ఏర్పాటు చేశారు. ఆశిష్ సూడ్, పంకజ్ కుమార్ సింగ్, రవీందర్ ఇంద్రాజ్ సింగ్ కూడా బీజేపీ కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఢిల్లీ మంత్రుల వివరాలను పరిశీలిస్తే..

()ప్రవేశ్ సహిబ్ సింగ్ వర్మ

ఢిల్లీ రాజకీయాల్లో జాట్ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రవేశ్ వర్మ,. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత అరవింద్ కేజ్రీవాల్‌ను 4,089 ఓట్ల తేడాతో ఓడించి జెయింట్ కిల్లర్ గా గుర్తింపు పొందారు.

()కపిల్ మిశ్రా

కపిల్ మిశ్రా కరావల్ నగర్ నుండి విజయం సాధించి, AAP అభ్యర్థి మనోజ్ కుమార్ త్యాగిని 23,355 ఓట్ల తేడాతో ఓడించారు. 2015లో AAP టికెట్‌పై గెలిచి, ఆ పార్టీ ప్రభుత్వం‌లో జల వనరుల మంత్రిగా సేవలందించారు. అయితే, తన సహచరుడు సత్యేంద్ర జైన్‌పై అవినీతి ఆరోపణలు చేసిన తర్వాత ఆయనను AAP కేబినెట్ నుండి తొలగించారు. 2020లో మోడల్ టౌన్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మిశ్రా, 2020 ఢిల్లీ అల్లర్ల ముందు ప్రోకేటివ్ స్టేట్‌మెంట్స్ ఇచ్చినందుకు విమర్శలకు గురయ్యారు.

()మంజిందర్ సింగ్ సిర్సా

రాజౌరి గార్డెన్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన మంజిందర్ సింగ్ సిర్సా, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ధన్వతి చందేలాను 18,000 ఓట్ల తేడాతో ఓడించారు. 2017లో జరిగిన ఉపఎన్నికల్లో కూడా ఆయన ఈ స్థానం నుండి గెలిచారు. కానీ, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి ఓటమిని చవిచూశారు.

ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..

()ఆశిష్ సూడ్

CM పదవి రేసులో ఉన్న మరో బలమైన నేత ఆశిష్ సూడ్. జనక్‌పురి నియోజకవర్గం నుండి AAP అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌పై 18,766 ఓట్ల తేడాతో గెలిచారు. జమ్మూ & కాశ్మీర్‌లో బీజేపీ కో-ఇన్‌చార్జ్‌గా కూడా పని చేస్తున్నారు.

()పంకజ్ కుమార్ సింగ్

మునిసిపల్ కార్పొరేషన్ ఢిల్లీ (MCD) మాజీ సభ్యుడు రాజా మోహన్ సింగ్ కుమారుడు అయిన పంకజ్ కుమార్ సింగ్, డెంటిస్టుగా పని చేసిన అనుభవం కలిగిన వ్యక్తి. ఆయన వికాస్‌పురి నియోజకవర్గం నుండి తన తొలి అసెంబ్లీ ఎన్నికలో AAP అభ్యర్థి మహీందర్ యాదవ్‌ను 13,000 ఓట్ల తేడాతో ఓడించారు.

()రవీందర్ ఇంద్రాజ్ సింగ్

బీజేపీకి చెందిన ప్రముఖ దళిత నేత అయిన రవీందర్ ఇంద్రాజ్ సింగ్, బవానా అసెంబ్లీ స్థానంలో గెలుపొందారు. AAP అభ్యర్థి జై భగవాన్ ఉప్కర్‌ను 31,000 ఓట్ల భారీ తేడాతో ఓడించారు. బీజేపీ SC మోర్చాలో కీలక సభ్యుడిగా ఉన్న రవీందర్ ఇంద్రాజ్ సింగ్, గత కొంతకాలంగా దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now