Delhi Fire: మాంసపు ముద్దలుగా శరీరాలు, ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, 43 మంది మృతి, సంఖ్య మరింతగా పెరిగే అవకాశం, మంటలను అదుపులోకి తీసుకుంటున్న ఫైర్ సిబ్బంది, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీఎం మోడీ, హోం మంత్రి అమిత్ షా
అనాజ్ మండీ(Anaj Mandi)లో గల ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో 43 మంది చనిపోయారు. ఘటనాస్థలానికి 30 ఫైరింజన్లు చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రిని తరలిస్తున్నారు. దాదాపు 50 మందిని సిబ్బంది రక్షించారు. అనాజ్ మండి ప్రాంతంలో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 43మందికి పైగా మృతిచెందినట్టు తెలుస్తోంది.
New Delhi, December 8: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అనాజ్ మండీ(Anaj Mandi)లో గల ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో 43 మంది చనిపోయారు. ఘటనాస్థలానికి 30 ఫైరింజన్లు చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రిని తరలిస్తున్నారు. దాదాపు 50 మందిని సిబ్బంది రక్షించారు. అనాజ్ మండి ప్రాంతంలో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 43మందికి పైగా మృతిచెందినట్టు తెలుస్తోంది.మంటల్లో మరో 30 మందికి పైగా చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు .
మరో 50 మందిని రెస్క్యూ టీమ్‌లు కాపాడి.. సమీపంలోని ఆస్పత్రులకు తరలించాయి. ఇక, మంటల్లో చిక్కుకొని కొంతమంది సజీవదహనం అయితే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 10 మందికి పైగా మృతిచెందారు. క్షతగాత్రుల్లో చాలా మందిని ఆర్‌ఎంఎల్ ఆస్పత్రి, హిందూ రావు ఆసుపత్రికి తరలించారు.
Delhi Factory Fire
రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలో కొందరు, హిందురావు ఆస్పత్రిలో మరి కొందరు చికిత్స పొందుతున్నారు. ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఉదయం 5.22 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ వచ్చింది. వెంటనే సిబ్బంది వెళ్లారని పేర్కొన్నారు. అగ్నిప్రమాదం 600 చదరపు అడుగులు గల ప్లాట్‌లో జరిగిందని డిప్యూటీ ఫైర్ చీఫ్ ఆఫీసర్ సునీల్ చౌదరి పేర్కొన్నారు. ఫ్యాక్టరీలో బాగా చీకటి ఉందని పేర్కొన్నారు.
Delhi Fire
అయితే అందులో స్కూల్ బ్యాగులు, బాటిళ్లు, ఇతర వస్తువులు కూడా ఉన్నాయని చెప్పారు. అగ్నిప్రమాదం జరిగే సమయంలో ఫ్యాక్టరీలో 25 మంది నిద్రిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. కూలీలు రాత్రి అక్కడే పడుకొన్నారని చెప్పారు. మంటలను పూర్తిగా ఆపివేశామని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఢిల్లి అగ్నిప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
PM Modi tweet
ఢిల్లిలో రాణి ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండీ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై హోం మంత్రి అమిత్‌షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అగ్ని ప్రమాదం దురదృష్టకరమన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు.