Delhi Fire: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం, నలుగురు అగ్నికి ఆహుతి, ఓల్డ్‌ సీమపురిలోని మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం విషాదకర ఘటన (Delhi Fire) చోటు చేసుకున్నది. ఓల్డ్‌ సీమపురి ప్రాంతంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు (Four Dead After Massive Fire Breaks Out ) అగ్నికి ఆహుతి అయ్యారు.

Four Dead After Massive Fire Breaks Out In Three-Storey Building In Seemapuri (Photo-ANI)

New Delhi, Oct 26: దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం విషాదకర ఘటన (Delhi Fire) చోటు చేసుకున్నది. ఓల్డ్‌ సీమపురి ప్రాంతంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు (Four Dead After Massive Fire Breaks Out ) అగ్నికి ఆహుతి అయ్యారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ సీమపురి ప్రాంతంలోని మూడు అంతస్తుల భవనంపై (Three-Storey Building In Seemapuri) అంతస్తులో మంగళవారం వేకువ జామున 4 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ నాలుగు ఫైర్‌ టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది.

ఆ తర్వాత నలుగురి మృతదేహాలను గుర్తించారు. అయితే, నలుగురు భారీ పొగకారణంగా ఊపిరాడక మృతి చెంది ఉంటారని అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో శాస్త్రిభవన్‌లో ప్యూన్‌గా చేస్తున్న 59 వ్యక్తి ఉన్నట్లు సమాచారం. మృతులు నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని, ప్యూన్‌తో పాటు భార్య, అతని ఇద్దరు పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. గుర్తు తెలియని వ్యక్తులపై భారత శిక్షాస్మృతిలోని 436,304ఎ సెక్షన్ల కింద తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement