Delhi Fire: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, మంటలను అదుపులోకి తీసుకువస్తున్న ఫైరింజన్లు, తప్పిన ప్రాణనష్టం, భారీ స్థాయిలో ఆస్తి నష్టం, రాజధాని స్పెషల్ ట్రైన్‌లో మంటలు
పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా ఫర్నిచర్ కాలి బూడిదయ్యింది.
New Delhi, February 7: ఢిల్లీలోని ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతం ఫేజ్-2 సంజయ్‌నగర్‌లో కాలనీలో శనివారం అర్ధరాతి భారీ స్థాయిలో అగ్నిప్రమాదం (Delhi Fire) జరిగింది. పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా ఫర్నిచర్ కాలి బూడిదయ్యింది. ఆప్రాంతంలో దట్టమైన పొగలు అలముకోవడంతో (Fire in Delhi) స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 27 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
అయితే భారీగా ఆస్తి నష్టం జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ సందర్భంగా అగ్నిమాపకశాఖ అధికారి మాట్లాడుతూ అర్ధరాత్రి 2 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని అగ్నిమాపకశాఖ అధికారి తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, 27 ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకువస్తున్నాయని చెప్పారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఢిల్లీ పోలీసులు అన్వేషిస్తారని చెప్పారు.
ఇక రాంచీ-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్(స్పెషల్ ట్రైన్)లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళకు గురయ్యాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం రాజధాని ఎక్స్‌ప్రెస్ గంగా ఘాట్ స్టేషన్ మీదుగా వెళుతుండగా, స్టేషన్ సిబ్బంది వెనుకనున్న నాల్గవ వ్యాగన్‌కు నిప్పంటుకోవడాన్ని గమనించారు. వెంటనే రైలులోని సిబ్బందికి ఈ విషయం తెలియజేసి, రైలును వెంటనే నిలిపివేయించారు.
వెంటనే రైల్వే ఇంజినీర్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. మరమ్మతు పనులు పూర్తయ్యాక రైలు ముందుకు కదిలింది. ఈ నేపధ్యంలో రైలు గంగా ఘాట్ స్టేషన్ వద్ద 25 నిముషాల పాటు నిలిచిపోయింది. దీనిపై దర్యాప్తు చేయాలని డీఆర్ఎం నీరజ్ అంబస్ట్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.