Delhi Girl Murder Case: బాలికను కత్తితో 20 సార్లు పొడిచిన రాక్షసుడు వీడే, యూపీలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, క‌ఠినంగా శిక్షిస్తామ‌ని హామీ

దేశ రాజధాని (Delhi) ఢిల్లీలో 16 ఏళ్ల బాలికను ఓ యువకుడు అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన కలకలం సృష్టించింది.ఆమె ప్రియుడు అందరూ చూస్తుండగానే బాలికపై దాదాపు 20 సార్లు కత్తితో పొడిచాడు.

Accused Sahil arrested near Uttar Pradesh's Bulandshahr. (Photo/ANI)

News, May 29: దేశ రాజధాని (Delhi) ఢిల్లీలో 16 ఏళ్ల బాలికను ఓ యువకుడు అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన కలకలం సృష్టించింది.ఆమె ప్రియుడు అందరూ చూస్తుండగానే బాలికపై దాదాపు 20 సార్లు కత్తితో పొడిచాడు.అంతటితో ఆగకుండా పెద్ద బండరాయితో బాలిక తలపై పలుసార్లు మోదాడు. ఈ వ్యవహారం మొత్తం అక్కడి సీసీటీవీల్లో (CCTV) రికార్డు అయ్యింది.

షాకింగ్ వీడియో, బాలికను నడిరోడ్డు మీద కత్తితో పదే పదే పొడిచి చంపిన ప్రియుడు

ఈ కేసులో నిందితుడు సాహిల్‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బులంద్‌షార్‌లో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఫ్రిడ్జ్, ఏసీ రిపేరింగ్ మెకానిక్‌గా ప‌ని చేస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. బాలిక హ‌త్య కేసులో నిందితుడిని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని ఢిల్లీ డిప్యూటీ పోలీసు క‌మిష‌న‌ర్ నుమ‌న్ న‌వ్లా స్ప‌ష్టం చేశారు. అయితే ఈ దారుణ ఘటనలో అత‌న్ని ఆపేందుకు ఎవ‌రూ సాహ‌సం చేయ‌లేదు. స్థానికులు త‌మ దారిన తాము వెళ్లిపోయారు. అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు కావ‌డంతో.. నిందితుడిని ప‌ట్టుకునేందుకు పోలీసుల‌కు సులువైంది.

కరెంటు పోల్‌ నిలబెడుతుండగా ఆరుమందికి విద్యుత్ షాక్‌, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన కూలీలు, జార్ఖండ్‌లో విషాదకర ఘటన

బాలిక త‌న ఫ్రెండ్ కుమారుడి పుట్టిన రోజు సంద‌ర్భంగా వారింటికి వెళ్తుండ‌గా.. మ‌ధ్య‌లో సాహిల్ అడ్డుకున్నాడు. బ‌ర్త్ డే పార్టీ విష‌యంలో ఇరువురి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు లోనైన సాహిల్ త‌న వెంట తెచ్చుకున్న క‌త్తితో బాలిక‌పై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. 21 సార్లు పొడిచి చంపాడు. ఆమె పుర్రెలో క‌త్తి ఇరుక్కుపోయింది. ఆ త‌ర్వాత ఆమె త‌ల‌పై బండ‌రాయితో మోదాడు. అనంత‌రం అక్క‌డ్నుంచి పారిపోయాడు.

Disturbing Video

మరోవైపు ఈ ఘటనను ఢిల్లీ మహిళా కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘‘ఢిల్లీ షాబాద్‌ డెయిరీ వద్ద ఓ అమాయక బాలిక హత్యకు గురైంది. ఢిల్లీలో నేరగాళ్లకు అడ్డూ అదుపులేకుండా పోయింది. దీనిపై పోలీసులకు నోటీసులు జారీ చేశాము. అన్ని హద్దులను దాటేశారు. నా కెరీర్‌లో ఇంత ఘోరాన్ని నేను చూడలేదు’’ అని పేర్కొన్నారు.

 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif