Delhi: ఢిల్లీలో వ్యభిచార గృహాలపై దాడులు, పోలీసుల రైడ్‌లో గోల్డ్ మెడలిస్ట్ క్రీడాకారిణి, ఇద్దరు మైనర్ బాలికలు, నిందితులపై పోక్సో యాక్ట్

ఢిల్లీ పోలీసులు కమ్లా మార్కెట్‌లోని జీబీ రోడ్డు ప్రాంతంలోని ఓ వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించగా ఇందులో ఓ కబడ్డీ క్రీడాకారిణి, గోల్డ్ మెడల్ విజేత సహా ఇద్దరు మైనర్ బాలికలను ఆదివారం రక్షించారు. మైనర్ బాలికల వయస్సు 17 సంవత్సరాలు కాగా వీరిని నెలల తరబడిగా బంధించి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు

Delhi Police rescued Gold Medalist Kabaddi Player Among 2 Minors From GB Road Brothel(X)

Delhi, Aug 5:  ఢిల్లీలో ఘరానా వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. ఢిల్లీ పోలీసులు కమ్లా మార్కెట్‌లోని జీబీ రోడ్డు ప్రాంతంలోని ఓ వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించగా ఇందులో ఓ కబడ్డీ క్రీడాకారిణి, గోల్డ్ మెడల్ విజేత సహా ఇద్దరు మైనర్ బాలికలను ఆదివారం రక్షించారు. మైనర్ బాలికల వయస్సు 17 సంవత్సరాలు కాగా వీరిని నెలల తరబడిగా బంధించి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ మహిళ సహా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

కమ్లా మార్కెట్ ప్రాంతంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు పక్కా సమాచారం మేరకు సెంట్రల్ డిస్ట్రిక్ట్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మైనర్ బాలికలు పట్టుబడగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి కౌన్సెలింగ్‌ ఇచ్చి షెల్టర్‌ హోంకు తరలించారు. పోలీసుల విచారణలో బాలికలు ఏడాది క్రితం కిరణ్‌దేవితో కలిసి వ్యభిచార గృహానికి వచ్చినట్లు తేలిందని, రిషి మరియు సంజయ్ అనే ఇద్దరు వ్యక్తులు వారిని ఆమె వద్దకు తీసుకువచ్చారని తేలింది. భర్త లేని ఒంటరి మహిళపై పదే పదే అత్యాచారం, స్నేహితుడి సాయంతో కత్తితో కసితీరా పొడిచి చంపి కక్ష తీర్చుకున్న మహిళ

నిందితుల్లో ఒకరైన లాలారామ్ అలియాస్ సునీల్ (48) బాలికలను పెద్దలుగా చూపించేందుకు వారి ఆధార్ కార్డులను తారుమారు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే మైనర్ బాలికలను వ్యభిచారంలోకి దింపుతున్న మరో నిందితుడు కిరణ్ (53)ను సైతం పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై పోక్సో చట్టంతో పాటు వివధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కబడ్డీలో జోనల్ స్థాయిలో బంగారు పతకం సాధించినా క్రీడాకారిణిని సైతం వ్యభిచార వృత్తిలోకి దించడంతో ఆమె కలలు కల్లలయ్యాయి. మైనర్ బాలికలను వారి కుటుంబాలతో కలిపేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.