Bomb Threat in Delhi: ఢిల్లీ పాఠశాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు.. విద్యార్థులను బయటకు పంపించి తనిఖీలు

నగరంలోని గ్రేటర్‌ కైలాష్‌ ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Cybercrime and Hacking (Photo Credit: Pexels)

Newdelhi, Aug 2: ఢిల్లీలో (Delhi) మరోసారి బాంబు బెదిరింపుల (Bomb Threat) మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. నగరంలోని గ్రేటర్‌ కైలాష్‌ ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పాఠశాలను బాంబుతో పేల్చేస్తామని దుండగులు ఓ మెయిల్ పంపించారు.  సమాచారం అందిన వెంటనే సదరు పాఠశాల వద్దకు వెళ్లిన పోలీసులు విద్యార్థులను బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. అయితే ఆ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువుగానీ, మరే పేలుడు పదార్థాలూ లభించలేదని అధికారి ఒకరు పేర్కొన్నారు.

భార్య వైఎస్ భారతితో కలిసి పాస్‌ పోర్ట్ రెన్యువల్ చేయించుకున్న మాజీ సీఎం జగన్

ఆగంతకుల కోసం వేట

ఈ మెయిల్‌ వచ్చిన సోర్స్ కోడ్, అడ్రస్ ఆధారంగా ఆగంతకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వారిని త్వరలో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

టీవీ డిబేట్ లైవ్ షోలో రేడియో జాకీ శేఖర్ భాషాను చెప్పుతో కొట్టిన హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య.. వీడియో వైరల్