Delhi Shocker: భార్యను చంపేసిన కిరాతక భర్త, అంతకన్నా ముందే కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, మరో ఘటనలో భార్యను చంపి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న భర్త

భార్య క‌నిపించ‌డం లేద‌ని పోలీసుల‌కు త‌ప్పుడు ఫిర్యాదు చేసి ఆపై ఆమెను హ‌త్య (Man kills wife) చేసిన వ్య‌క్తి ఉదంతం ఢిల్లీలో వెలుగుచూసింది. జూన్ 13 నుంచి త‌న భార్య (35) క‌నిపించ‌డం లేద‌ని నిందితుడు ఫిర్యాదు చేశాడు. భ‌ర్త‌ను ప్ర‌శ్నించిన పోలీసుల‌కు అత‌డిపై అనుమానం క‌ల‌గ‌డంతో మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Representational Image | (Photo Credits: IANS)

New Delhi, June 29: ఢిల్లీలో దారుణ ఘటన చోటు (Delhi Shocker) చేసుకుంది. భార్య క‌నిపించ‌డం లేద‌ని పోలీసుల‌కు త‌ప్పుడు ఫిర్యాదు చేసి ఆపై ఆమెను హ‌త్య (Man kills wife) చేసిన వ్య‌క్తి ఉదంతం ఢిల్లీలో వెలుగుచూసింది. జూన్ 13 నుంచి త‌న భార్య (35) క‌నిపించ‌డం లేద‌ని నిందితుడు ఫిర్యాదు చేశాడు. భ‌ర్త‌ను ప్ర‌శ్నించిన పోలీసుల‌కు అత‌డిపై అనుమానం క‌ల‌గ‌డంతో మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పలు ర‌కాలుగా ప్ర‌శ్నించిన మీద‌ట భార్య‌ను తానే హ‌త్య (Delhi man kills wife) చేశాన‌ని అంగీక‌రించాడు.

ఆమె చెడు అల‌వాట్ల‌తో విసిగి ఈ దారుణానికి పాల్ప‌డ్డాన‌ని నేరాన్ని అంగీక‌రించాడు. మ‌హిళ క‌నిపించ‌క‌పోవ‌డంతో త‌న అత్తింటి వారు బులంద్‌ష‌హ‌ర్‌లో పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో త‌న‌పై అనుమానం రాకుండా త‌న భార్య అదృశ్య‌మైంద‌ని మిస్సింగ్ కేసు న‌మోదు చేశాన‌ని చెప్పాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు త‌దుప‌రి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతిలో షాకింగ్ నిజాలు వెలుగులోకి, ఆ తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకోలేదు, ఇద్దరు మాంత్రికులు గుప్త నిధుల కోసం వారికి విషం ఇచ్చి చంపేశారు

ఇక మరో ఘటనలో భర్తే భార్య ను చంపి తను ఆత్హహత్య చేసుకున్నాడు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన మహానంద బిశ్వాస్ (24), పంప సర్కార్ (22) జీవనోపాధి కోసం నగరానికి వచ్చి ప్రేమ్ నగర్ లో నివాసం ఉంటూ జీవీకే మాల్ లో సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా భార్య భర్తల మధ్య తగాదాలు జరుగుతుండగా నిన్న(సోమవారం) మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో భార్యను నీళ్లతో ఉన్న బకెట్లో ముంచి హత్య చేసి అనంతరం సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నాంపల్లి రైల్వే స్టేషన్లో రైలు కిందపడి మృతిచెందాడు.

రైల్వే పోలీసులు గమనించి మృతదేహాన్ని పోస్టమార్టం తరలించే సమయంలో అతని వద్ద ఉన్న చిన్న డైరీలో భార్యను చంపి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసుకున్నాడు. దీంతో నాంపల్లి రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు పంజాగుట్ట పోలీసులు ప్రేమ్ నగర్ లోని వారి నివాసం ఉంటున్న గదికి తాళం వేసి ఉండగా తాళాలు పగలగొట్టి భార్య మృతదేహానికి పోస్టమార్టం జరిపించారు. అనంతరం క్లూస్‌ టీంను రప్పించి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు.