Delhi Shocker: దేశ రాజధానిలో ఘోరం, ఆటో - కారు ఢీ కొని, తల్లిదండ్రుల కళ్లముందే 13 ఏళ్ల బాలుడి మృతి, కన్నీళ్లు పెట్టించే ఘటన, కారు డ్రైవర్ పరారీ..

శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం.. బాబ బండా సింగ్ బహదూర్ సేతు ప్రాంతంలో చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. రెండు వాహనాలు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి.

Accident Representative image (Image: File Pic)

New Delhi, March 19: న్యూఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం.. బాబ బండా సింగ్ బహదూర్ సేతు ప్రాంతంలో చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు తీవ్రంగా ధ్వంస మయ్యాయి. కారులో ఒక మహిళ, బాలుడు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

అదే విధంగా ఆటోలో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆటోలో తల్లిదండ్రులు, తన సోదరుడితో కలిసి ప్రయాణిస్తున్న 13 ఏళ్ల యువకుడు స్పాట్ లోనే చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడిని కరణ్ భట్ (13)గా గుర్తించగా, గాయపడిన వారిలో జనక్ జనధన్ భట్ (45), గీతా భట్, కార్తీక్ భట్ (18), ఆటో డ్రైవర్ వాకర్ ఆలం (25) ఉన్నారు. కారు నడిపిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరీశీలిస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత, అంబులెన్స్ లకు సమాచారం ఇచ్చారు. పోలీసులు , స్థానికులు సహకారంతో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

కారు ప్రమాదానికి మితిమీరిన వేగం కారణామా లేదా డ్రైవర్ ఎవరైన మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తప్పించారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్పించకుండా చర్యలు చేపట్టారు.