Delhi Shocker: ఢిల్లీలో దారుణం, బాలికపై తెగబడిన కామాంధులు, బాలుడితో సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
బాలికపై లైంగిక వేధింపులు జరిగినట్లు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు
వాయువ్య ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఇద్దరు వ్యక్తులతో పాటు ఒక బాలుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. బాలికపై లైంగిక వేధింపులు జరిగినట్లు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు నిందితులను గుర్తించి, వారిలో ఒక యువకుడు సహా ముగ్గురిని పట్టుకున్నారు. ఒక నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను షహబాద్ డైరీ ప్రాంతానికి చెందిన బాబీ (19), రాహుల్ (20)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురితో పాటు, నేరాన్ని నివేదించడంలో విఫలమైనందుకు పోక్సో చట్టంలోని సెక్షన్ 21లో ఇద్దరు బాలనేరస్థులను కూడా అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.