Representative Image (File Image)

Lucknow, June 29: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తొడి కోడళ్ల గొడవలో మామగారు చిన్న కోడలి తల నరికేశాడు. అనంతరం ఆగ్రా జిల్లాలోని కిరావాలి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.కాగా అతని చిన్నకొడుకు, మృతురాలి భర్త ఫరూఖాబాద్లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన రఘువీర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ఆగ్రాలోని మాలిక్ పూర్ గ్రామంలో నివాసముండే రఘువీర్ (62)కు ఇద్దరు కుమారులు.

పెద్ద కుమారుడు చనిపోగా అతని భార్య తమతోనే ఉంటోందని.. ఆమెతో చిన్న కోడలు ప్రియాంక సింగ్ (28) తరచూ గొడవపడుతూ ఉండేదని చెప్పాడు. వారిని కలిసి ఉండాలని ఎంత చెప్పినా వినేవారు కాదని పోలీసులకు తెలిపాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు కోడళ్లు గొడవపడ్డారని అడ్డు తీయడానికి వెళ్లిన రెండో కోడలు కాలితో తన్నిందని అందుకే తల నరికేశానని తెలిపాడు.

చిన్న గొడవలో దారుణం, భార్యను కత్తితో పొడిచి చంపి అనంతరం ఉరివేసుకుని చనిపోయిన భర్త, ఢిల్లీలో విషాదకర ఘటన

ఆగ్రా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి ఇద్దరి కోడళ్ల మధ్య వాగ్వాదం చెలరేగిందని, ఇద్దరూ సిగపట్లు పట్టుకున్నారని.. విడదీసేందుకు మధ్యలోకి వెళ్లిన రఘువీర్ ను ప్రియాంక కాలితో తన్నగా.. దూరాన పడిన మామగారు కోపోద్రిక్తుడై గొడ్డలి అందిపుచ్చుకుని చిన్న కోడలి మెడ మీద వేటు వేశాడని.. దాంతో ఆమె తల మొండెం రెండూ వేరై అక్కడికక్కడే చనిపోయిందని తెలిపారు. మృతురాలు ప్రియాంక సింగ్ తండ్రి ఫిర్యాదు ప్రకారం తండ్రీ, కొడుకులు ఇద్దరి పైనా కేసులు నమోదు చేశారు.