Delhi Violence: రావణకాష్టంలా మారిన ఢిల్లీ, అర్థరాత్రి రంగంలోకి దిగిన అజిత్ డోవల్, ఇప్పటికే మూడు సార్లు సమావేశమైన హోమంత్రి అమిత్ షా, 18కి చేరిన మృతుల సంఖ్య
ఢిల్లీ పోలీసు అధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సమావేశమైన గంటల్లోనే డోవల్ రంగంలోకి దిగారు.
New Delhi, February 26: దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ చట్టానికి(CAA) వ్యతిరేకంగా, అనుకూలంగా ఉన్న రెండు వర్గాల మధ్య ఘర్షణ (Delhi Violence) రాజుకున్న నేపథ్యంలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ (Ajit Doval) అర్థరాత్రి ఎంట్రీ ఇచ్చారు. ఢిల్లీ పోలీసు అధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సమావేశమైన గంటల్లోనే డోవల్ రంగంలోకి దిగారు.
ఈశాన్య దిల్లీలో 'కనిపిస్తే కాల్చివేత' ఆదేశాలు
మంగళవారం అర్ధరాత్రి శీలంపూర్‌లో ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్, ఈశాన్య డీసీపీ వేదప్రకాశ్ సూర్యలతో కలిసి శాంతిభద్రతలను పర్యవేక్షించారు. అంతేకాదు.. మౌజ్‌పూర్, జఫరాబాద్, గోకుల్‌పురి, భాజన్‌పూర్ ప్రాంతాల్లో తిరిగి పరిస్థితులను సమీక్షించారు. ఘర్షణ రాజుకున్న జఫరాబాద్, మాజ్‌పూర్, బాబర్‌పూర్ ప్రాంతాల్లో ఆయన స్వయంగా పర్యటించారు.
ఢిల్లీ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు అధికారులతో ఇప్పటికే మూడుసార్లు సమావేశం నిర్వహించారు. అనంతరం హింసాకాండను అణచివేసి శాంతిభద్రతల పరిస్థితులను మెరుగుపర్చేందుకు అజిత్ డోవల్ ను రంగంలోకి దించారు. మంగళవారం నాటి త్రివేండ్రం పర్యటనను కూడా హోం మంత్రి రద్దు చేసుకున్నారు.
మరోవైపు ఢిల్లీ ఆందోళనలో మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరింది. ఇందులో ఒక కానిస్టేబుల్ ఉంగా మిగతా వారు ఆందోళనకారులు. నిన్న 13 మంది ఉండగా.. ఇవాళ ఉదయం మరో నలుగురు చనిపోయారు. తర్వాత మరొకరు చనిపోయినట్టు జీటీబీ ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
దిల్లీలో సిఎఎ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్ణణ
అల్లరిమూకలు ఎక్కడ దాక్కుని ఉన్నారు..? ఆందోళన మూలాలపై ఏం ఫోకస్ చేశారు. ఈ విషయాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్చను కల్పించారు. పారామిలిటరీ బలగాలు కూడా హస్తినలో రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని తాజా పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీకి అజిత్ దోవల్ వివరించనున్నారు. పరిస్థితిని అణచివేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నామో ప్రధానికి తెలియజేసే అవకాశం ఉంది.
కాగా ఢిల్లీలో సాగిన హింసాకాండపై న్యాయవాది సూరూర్ మాండర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు జడ్జి మంగళవారం అర్దరాత్రి అత్యవసర విచారణ జరిపి ఆదేశాలు జారీ చేశారు.ఢిల్లీ హింసాకాండలో గాయపడిన వందలాదిమంది క్షతగాత్రులు ఆసుపత్రికి వెళ్లలేక పోతున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.అంబులెన్సులు, ఇతర వాహనాలు ముందుకు వెళ్లకుండా ఆందోళనకారులు అడ్డుకుంటున్నారని పిటిషనర్ సురూర్ మాండర్ ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్ మురళీధర్ నివాసంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
Here's ANI Tweet
దీంతో జస్టిస్ మురళీధర్ అర్దరాత్రి ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించి హింసాకాండలో గాయపడిన వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు సురక్షితంగా తీసుకువెళ్లేలా భద్రత కల్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులను జీటీబీ ఆసుపత్రి, ఎల్ఎన్‌జేపీ, మౌలానా ఆజాద్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు సురక్షితంగా తీసుకువెళ్లి చేర్చాలని జడ్జి మురళీధర్ ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.