International Flights Suspended: అంతర్జాతీయ విమాన సర్వీసులపై మరోసారి నిషేధం, జూలై 15 అర్ధరాత్రి వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు, ఉత్తర్వులు జారీ చేసిన డీజీసీఏ

ఇందులో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై మరోసారి నిషేధాన్ని (International Flights Suspended) పొడిగించింది. జూలై 15 అర్ధరాత్రి వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను ( International Commercial Passenger Services) రద్దు చేస్తున్నట్టు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌( DGCA) ప్రకటించింది. ఈ మేరకు డీజీసీఏ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే కార్గో సర్వీసులు మాత్రం యథావిథిగా కొనసాగుతాయని డీజీసీఏ స్పష్టం చేసింది. ప్యాసింజర్ సర్వీసులు రద్దవుతాయని తెలిపింది.

DGCA Logo (Photo Credits: ANI)

New Delhi, June 26: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై మరోసారి నిషేధాన్ని (International Flights Suspended) పొడిగించింది. జూలై 15 అర్ధరాత్రి వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను ( International Commercial Passenger Services) రద్దు చేస్తున్నట్టు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌( DGCA) ప్రకటించింది.

ఈ మేరకు డీజీసీఏ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే కార్గో సర్వీసులు మాత్రం యథావిథిగా కొనసాగుతాయని డీజీసీఏ స్పష్టం చేసింది. ప్యాసింజర్ సర్వీసులు రద్దవుతాయని తెలిపింది. కరోనా కల్లోలానికి తిరునల్వేలి హల్వా యజమాని ఆత్మహత్య, దేశంలో రికార్డు స్థాయిలో 17,296 కేసులు నమోదు, 5 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు

మార్చి చివరి వారంలో కరోనా లాక్‌డౌన్‌ (Corona Lockdown) విధించడానికి కొద్ది రోజుల ముందే అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులపై కేంద్రం నిషేధం విధించిన సంగతి విదితమే. అయితే మే 25 నుంచి పలు రూట్లలో దేశీయ విమాన సర్వీసులకు కేంద్రం అనుమతించింది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై మాత్రం నిషేధాన్ని అలాగే కొనసాగించారు. కొద్ది రోజుల కిందట కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌.. కరోనా కేసుల సంఖ్యను బట్టి జూలై నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను అనుమతించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

Here's  DGCA Tweet

అయితే ప్రస్తుతం భారత్‌లో కోవిడ్-19 కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతోనే విమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు లాక్‌డౌన్‌తో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వందేభారత్‌ మిషన్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ విమానాలు నడుస్తాయా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.