Digvijaya Singh: ప్రధాని గారూ..ఎంతమందిని ఆస్పత్రికి పంపాలనుకుంటున్నారు, వెంటనే భూమి పూజను ఆపేయండి, నరేంద్రమోదీని కోరిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్
అయోధ్య రామ మందిర నిర్మాణం పూజ ద్వారా మీరు ఎంతమందిని ఆస్పత్రికి పంపాలనుకుంటున్నారు. వెంటనే ‘భూమి పూజ’ (Bhoomi Pujan) కార్యక్రమాన్ని నిలిపివేయండి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సరికాదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రధానమంత్రిని (Digvijaya Singh Urges PM Narendra Modi) కోరారు.
New Delhi, August 3: భారత ప్రధాని గారూ.. అయోధ్య రామ మందిర నిర్మాణం పూజ ద్వారా మీరు ఎంతమందిని ఆస్పత్రికి పంపాలనుకుంటున్నారు. వెంటనే ‘భూమి పూజ’ (Bhoomi Pujan) కార్యక్రమాన్ని నిలిపివేయండి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సరికాదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రధానమంత్రిని (Digvijaya Singh Urges PM Narendra Modi) కోరారు. భూమి పూజ ఇన్విటేషన్ కార్డ్ పస్ట్ లుక్ ఇదే, విశిష్ట అతిథిగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్‌రావు భాగవత్, ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ
అయోధ్యలో ఆగస్టు 5న నిర్వహించే రామ మందిరం ‘భూమి పూజ’ కార్యక్రమాన్ని నిలిపివేయాలని..కార్యమానికి హాజరుకావల్సిన ముఖ్యనేతలు, పూజారులు సైతం కోవిడ్-19 భారీన పడ్డారని దిగ్విజయ్ (Digvijaya Singh) తెలిపారు. మోదీ రామ మందిర నిర్మాణ ‘భూమి పూజ’ (Ram Temple ‘Bhoomi Pujan) ఆచారాలతో ఎంత మందిని ఆస్పత్రులకు పంపాలనుకుంటున్నారని తీవ్రంగా ప్రశ్నించారు. ఈ విషయంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాథ్ కూడా పరిశీలించాలన్నారు. అదే విధంగా ప్రధానితో చర్చించి భూమి పూజను ఆపాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన పూజారులు, యూపీ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు కూడా కరోనా సోకిందన్నారు. ఇటువంటి సంక్లిష్టమైన సమయంలో సీఎం యోగి, ప్రధాని మోదీ కూడా 14రోజుల పాటు హోం కార్వటైన్‌కు పరిమితం కావాలన్నారు. ‘భూమి పూజ’ కార్యక్రమానికి ఏమాత్రం అనుకూలం కాని తేదీని నిర్ణయించారని మండిపడ్డారు. వేల ఏళ్లనాటి హిందువుల విశ్వాసం కంటే మోదీకి సౌకర్యమైన రోజు నిర్ణయించడం గొప్పదా అని ట్విటర్‌లో మండిపడ్డారు.