Diwali 2020: మీ వల్లే దేశం సురక్షితంగా ఉంది, మీతో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి, సైనికుల మధ్యలో దీపావళి వేడుకలను జరుపుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, సైనికుల కుటుంబాలకు ప్రధాని కృతజ్ఞతలు

హిమాలయ శిఖరాల్లో ఉన్నా... ఎడారిలో ఉన్నా, దట్టమైన అడువులు, లోతైన సముద్రాలు... ఇలా ఎక్కడ ఉన్నా శౌర్యంతో జవాన్లు పోరాడతారని, ఎదురయ్యే ప్రతి సవాల్‌లోనూ విజయం సాధిస్తూనే ఉంటున్నారని ప్రధాని మోదీ సైనికులపై ప్రశంసల వర్షం కురిపించారు.

PM Narendra Modi celebrates Diwali with Indian soldiers (Photo Credits: ANI)

Jaisalmer, November 14: ‌ప్రతి ఏడాది మాదిరిగానే ప్ర‌ధాని మోదీ దీవ‌పాళి వేడుక‌ల‌ను (Diwali 2020) సైనికుల‌తో జరుపుకున్నారు. రాజ‌స్థాన్ జైస‌ల్మేర్ స‌మీపంలో ఉన్న లాంగేవాలాలో బీఎస్ఎఫ్ జ‌వాన్లు, సైనికుల‌తో దీపావ‌ళి పండుగ‌ (PM Narendra Modi Celebrates Diwali With Defence Personnel) జ‌రుపుకున్నారు. ప్ర‌ధానితోపాటు డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ బిపిన్ రావ‌త్‌, ఆర్మీ చీఫ్ న‌ర‌వ‌ణే, బీఎస్ఎఫ్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ రాకేశ్ ఆస్తానా కూడా ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. గ‌తేడాది దిపావ‌ళిని జ‌మ్ముక‌శ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఉన్న‌ నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద సైనికులతో జ‌రుపుకున్న విషయం విదితమే.

ప్ర‌ధాని మోదీ మొద‌టిసారిగా 2014లో సియాచిన్‌లో సైనికుల‌తో ( Indian Soldiers) జ‌రుపుకున్నారు. ఆ ఆన‌వాయితీని గ‌త ఏడేండ్లుగా కొన‌సాగిస్తున్నారు. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు కూడా ఇదేవిధంగా సైనికుల‌తో దీపావ‌ళిని జ‌రుపుకునేవారు. 2018లో ఉత్తరాఖండ్‌ సరిహద్దు సైనికులతో కలిసి మోదీ (PM Narendra Modi) దీపావళి పండుగను జరుపుకున్నారు. 2017లోనూ ఉత్తర కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లో సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు

PM Narendra Modi Addresses Soldiers at Longewala Post on Diwali: 

ఈ సందర్భంగా పీఏం మాట్లాడుతూ.. సైనికులతో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వీరమరణం పొందిన జవాన్లను నివాళులు అర్పించిన మోదీ..ప్రజలంతా దీపాలు వెలిగించి దేశాన్ని కాపాడుతున్న సైనిక వీరులకు వందనం చేయాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణ కోసం సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవన్నారు. జవాన్ల కోసం స్వీట్లు, దేశ ప్రజల ప్రేమ తీసుకువచ్చానంటూ మోదీ వ్యాఖ్యానించారు.

పండుగ వేళ పాక్ దాడి, ఎదురుదాడికి దిగిన భారత్, 8 మంది పాక్‌ జవాన్లను మట్టుబెట్టిన భారత భద్రత బలగాలు, నలుగురు జవాన్లు వీర మరణం

మీరు మంచు కురిసే ప్రాంతంలో ఉన్నా... ఎత్తైన పర్వత సానువుల్లో ఉన్నా... లేదంటే ఎడారి ప్రాంతంలో ఉన్నా... ఎక్కడున్నా... మీ మధ్యలో దీపావళి జరుపుకుంటేనే నాకు దీపావళి పండగలా అనిపిస్తుంది. మీ మొహాల్లో ఆనందం చూసినప్పుడు నా ఆనందం ద్విగుణీకృతమవుతుంది. మీరుంటేనే దేశం ఉంటుంది. దేశంలో పండుగలూ ఉంటాయి. దేశ ప్రజలందరి శుభాకాంక్షలు, ఆదరాభిమానాలు మోసుకొని మీ మధ్యకొచ్చా.’’ అని ప్రధాని నరేంద్ర మోదీ సైనికులనుద్దేశించి వ్యాఖ్యానించారు.

హిమాలయ శిఖరాల్లో ఉన్నా... ఎడారిలో ఉన్నా, దట్టమైన అడువులు, లోతైన సముద్రాలు... ఇలా ఎక్కడ ఉన్నా శౌర్యంతో జవాన్లు పోరాడతారని, ఎదురయ్యే ప్రతి సవాల్‌లోనూ విజయం సాధిస్తూనే ఉంటున్నారని సైనికులపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశ సరిహద్దుల వెంబడి ఉన్న అనేక పోస్టుల్లో ఎవరికైనా ఎక్కువ కాలం గుర్తుండే పోస్ట్ ‘లోంగేవాలా పోస్ట్’ అని, తరతరాలుగా ఈ లోంగేవాలా పోస్ట్ అందరికీ గుర్తుండి పోతుందని మోదీ పేర్కొన్నారు.

ఇక్కడే దాయాది పాకిస్తాన్‌కు భారత జవాన్లు దీటైన సమాధానం చెప్పారని, శత్రువులెవరూ దేశ జవాన్ల ముందు నిలబడలేరన్న గట్టి సంకేతాలను కూడా ఇక్కడి నుంచే పంపారని మోదీ గుర్తు చేశారు. ప్రతి భారతీయుడి గుండెల్లో శౌర్యాన్ని నింపే విధంగా సైనికులు ఈ పోస్ట్‌లో తమ పరాక్రమాన్ని చూపారని మోదీ ప్రశంసించారు. ‘‘ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తల్లో దీపావళి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని సియాచిన్ ప్రాంతంలో పర్యటించాను. ఆ సమయంలో అందరూ నిబిడాశ్చర్యంలో మునిగిపోయారు. అయినా నా గురించి మీకు తెలుసు. ప్రతి పర్వదినాన్నీ నా సన్నిహితులతో జరుపుకుంటానని మీకు తెలుసు. ఈ సంవత్సరం కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను.’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

సరిహద్దుల వెంట దేశం కోసం పనిచేస్తోన్న సైనికులందరి కుటుంబాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలుపుతూ... వారందరికీ శిరస్సు వంచి నమస్కరించారు. దేశం సురక్షితంగా ఉందంటే సరిహద్దుల్లో రక్షణగా ఉన్న సైనికుల వల్లేనని, తీవ్రవాదంతో, ఉగ్రవాదంతో, దేశ ద్రోహులతో జవాన్లు పోరాడుతూ... దేశానికి రక్షణ కల్పిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఇతర దేశాలను అర్థం చేసుకోడానికే భారత్ మొదట ప్రాధాన్యం ఇస్తుందని, ఆ సమయంలో ఇతర దేశాలు కూడా భారత్‌ను అదే రీతిలో అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ఈ సిద్ధాంతాన్ని పక్కనబెట్టి, దీనికి వ్యతిరేకంగా ఏ దేశం ప్రవర్తించినా భారత్ వారికి గట్టిగా బుద్ధి చెబుతుందని ప్రధాని మోదీ తీవ్రంగా హెచ్చరించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Andhra Pradesh: సూపర్‌ సిక్స్‌ అమలుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, ఆర్థిక పరిస్థితి మెరుగు పడ్డాకే పథకాలు అమలు చేస్తామని వెల్లడి, ప్రజలు అర్థం చేసుకోవాలని సూచన

Warangal Road Accident: వీడియో ఇదిగో, మద్యం మత్తులో లారీ డ్రైవర్, ఇనుప స్తంభాల కింద చితికిపోయిన వలస కార్మికుల మృతదేహాలు, వరంగల్‌-ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదంలో ఏడుగురు మృతి, మరో ఆరుమందికి గాయాలు

UCC In Uttarakhand: సహజీవనం దాస్తే జైలుకెళ్లాల్సిందే, ఉత్తరాఖండ్‌లో నేటి నుంచి అమల్లోకి యూనిఫాం సివిల్ కోడ్ కోడ్, అసలేంటి ఈ ఉమ్మడి పౌర స్మృతి, యూసీసీపై సమగ్ర కథనం ఇదిగో..

Guillain Barre Syndrome Cases Increased in Maharashtra: మహారాష్ట్రను వణికిస్తున్న కొత్త వ్యాధి, ఇప్పటికే ఒకరు మృతి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 73 మంది

Share Now