Indian security forces near Line of Control in Jammu and Kashmir (Photo Credits: IANS)

Srinagar, November 14: దీపావళి వేళ బార్డర్ తుపాకుల కాల్పులతో (J&K Ceasefire Violation) మార్మోగిపోయింది. జమ్మూకశ్మీర్లో శుక్రవారం సరిహద్దుల వెంట పలు చోట్ల భారత భద్రత బలగాలు, పౌరులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఆ కాల్పుల్లో నలుగురు జవాన్లు (4 Jawans Martyred) ప్రాణాలు కోల్పోయారు. పాక్‌ కాల్పులకు భారత్‌ దీటుగా బదులిచ్చింది. భారత్‌ జరిపిన ఎదురు కాల్పుల్లో 8 మంది పాక్‌ జవాన్లు చనిపోయారు. దాదాపు 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పాక్‌ బంకర్లపై భారత సైన్యం తూటాల వర్షం కురిపించింది. భారత జవాన్ల కాల్పుల్లో 8 మంది పాక్‌ రేంజర్లు (Indian Army Kills 7-8 Pak Soldiers) హతమయ్యారు. మరికొంత మంది గాయపడ్డారు. అంతకుమందు ఎల్‌వోసీ వెంబడి పాకిస్తాన్‌ జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో ఇద్దరు జవాన్లు, నలుగురు పౌరులు ఉన్నారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరు దేశాల మధ్య కాల్పుల నేపథ్యంలో కశ్మీర​ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు వెంబడి బలగాలను మరింత అప్రమత్తం చేశారు.

భారత్ మీద బాంబు దాడికి చైనాతో కలిసి పాకిస్తాన్ ప్రయత్నం, అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ, పాక్ క్వాడ్‌కాప్టర్‌‌ను మట్టుబెట్టిన భారత సైన్యం

భారత్‌లోకి చొరబాట్లకు తోడ్పడేందుకు వీలుగా పాక్‌ సైనికులు శుక్రవారంనాడు నియంత్రణ రేఖ వెంబడి గురేజ్‌ సెక్టార్‌ నుంచి యూరీ సెక్టార్‌ దాకా పలు సెక్టార్లలో మోర్టార్లతో, ఇతర ఆయుధాలతో గుళ్లవర్షం కురిపించారు. వారి కుతంత్రాన్ని పసిగట్టిన భారత జవాన్లు భారీస్థాయిలో ఎదురుకాల్పులు జరిపారు. యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైళ్లు, రాకెట్‌లతో విరుచుకుపడ్డారు.. పాక్‌ ఆర్మీకి చెందిన పలు బంకర్లను, ఆయుధ గిడ్డంగులను ధ్వంసం చేశారు. భారత్‌లోకి చొరబడే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే భవనాలను కూల్చివేశారు. చమురు డంపులను తగులబెట్టారు.

Indian Army Destroys Pakistani Bunker: 

మృతి చెందిన పాక్‌ జవాన్లలో దాదాపు ముగ్గురు ఆ దేశ ‘స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌’నకు చెందిన వారుగా సమాచారం. పాకిస్థాన్‌ బంకర్లు, చమురు డంపులు, లాంచ్‌పాడ్‌లను ధ్వంసం చేస్తున్న పలు వీడియోలను ఆర్మీ వర్గాలు విడుదల చేశాయి. ఆ వీడియోల్లో భారత బలగాలు పాక్‌ స్థావరాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలున్నాయి. ఒక బంకర్‌పైకి భారత సైనికులు ప్రయోగించిన యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ వీడియోలో ఉంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే అదే బంకర్‌ పైకి మరో రెండు మిస్పైళ్లను మన సైనికులు ప్రయోగించారు. దాదాపు శుక్రవారమంతా నియంత్రణ రేఖ వెంబడి ఉన్న సరిహద్దు భద్రతా దళాలు కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

4 Jawans Martyred in Ceasefire Violations by Pakistan:

దావర్‌, కేరన్‌, యూరీ, నౌగామ్‌ సెక్టార్లలో పాక్‌ ఎలాంటి కవ్వింపూ లేకుండానే కాల్పులకు పాల్పడిందని.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కల్నర్‌ రాజేశ్‌కాలియా చెప్పారు. మన జవాన్ల త్యాగానికి దేశం శాల్యూట్‌ చేస్తుందని పేర్కొన్నారు. వారం రోజుల వ్యవధిలో పాక్‌ వైపు నుంచి చొరబాట్లకు ప్రయత్నించడం ఇది రెండోసారి అని.. నవంబరు 7-8 తేదీల్లో మాచిల్‌ సెక్టార్‌లో చొరబాటుకు యత్నించిన ముగ్గురు మిలిటెంట్లను మట్టుబెట్టామని వారు వెల్లడించారు.

కల్నల్‌ కాలియా తెలిపిన వివరాల మేరకు... పాక్‌ కాల్పుల్లో చనిపోయిన వారిలో బీఎస్‌ఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాకేశ్‌ దోవల్, నలుగురు ఆర్మీ జవాన్లు, ఆరుగురు పౌరులు ఉన్నారు. 8 మంది పౌరులతో పాటు నలుగురు జవాన్లు గాయపడ్డారు. నియంత్రణ రేఖ వెంట ఉడి, దావర్, కేరన్, నౌగమ్, గురెజ్‌ సహా పలు సెక్టార్లలలో పాకిస్తాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిందని తెలిపారు.

మరో పుల్వామా దాడికి పాక్ పన్నాగం, 27 మంది ఉగ్రవాదులకు శిక్షణ, దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారన్న సమాచారంతో అప్రమత్తమైన ఇంటెలిజెన్స్ అధికారులు

పాక్‌ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బీఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ రాకేశ్‌ దోవల్‌ ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌కు చెందినవారు. 2004లో బీఎస్‌ఎఫ్‌లో చేరారు. ఆయనకు తండ్రి, భార్య, తొమ్మిదేళ్ల కూతురు ఉన్నారు. దేశ రక్షణలో ఆయన వీర మరణం పొందారు’ అని ఢిల్లీలోని బీఎస్‌ఎఫ్‌ అధికారి తెలిపారు. నియంత్రణ రేఖ వెంట ఫార్వర్డ్‌ లొకేషన్‌లో ఎస్‌ఐ రాకేశ్‌ దోవల్‌తో పాటు విధుల్లో ఉన్న కాన్‌స్టేబుల్‌ వాసు రాజాకు గాయాలయ్యాయని, ఆయన చికిత్స పొందుతున్నారని వివరించారు.

పాక్‌ ఆర్మీ స్థావరాలు, ఆయుధ కేంద్రాలు, ఉగ్రవాద చొరబాటు స్థావరాలు భారీగా ధ్వంసానికి సంబంధించిన పలు వీడియోలను ఆర్మీ విడుదల చేసింది. భారత్‌ ప్రయోగించిన క్షిపణి నేరుగా పాక్‌ ఆర్మీ బంకర్‌ను ఢీ కొట్టి ధ్వంసం చేసిన దృశ్యాలు మరో వీడియోలో ఉన్నాయి.