Telangana Congress: కాంగ్రెస్ నేతపై గాడిద దొంగతనం కేసు, సీఎం జన్మదిన వేడుకల కోసం వాడిన గాడిదను కొట్టేసినట్లు గుర్తించిన పోలీసులు, బల్మూరి వెంకట్ పై పలు సెక్షన్ల కింద కేసు

సీఎం కేసీఆర్ పుట్టిన రోజు(CM KCR Birthday) సందర్బంగా ఆయన వినూత్నంగా నిరసన తెలిపారు.

Hyderabad, Feb 18: తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎన్‌ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట్‌ పై (Balmuri Venkat) గాడిదను దొంగతనం చేశారని (Donkey theft case) కేసు పెట్టారు పోలీసులు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు(CM KCR Birthday) సందర్బంగా ఆయన వినూత్నంగా నిరసన తెలిపారు. గాడిదకు సీఎం కేసీఆర్ ఫోటో పెట్టి...దాంతో కేక్ కట్ చేయించారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చివరకు జంతుహింసకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నేతపై కేసు పెట్టారు.

NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బల్మూరి వెంకట్ పై జమ్మికుంటలోని (Jammikunta) పోలీసు స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో గాడిదను దొంగతనం చేశారనే కేసు కూడా ఉంది. ఈ విషయాన్ని కరీంనగర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ మీడియాకు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గాడిదను వెంకట్ దొంగతనం చేయడమే కాకుండా దాన్ని తీవ్రంగా హింసించారని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Telangana: తెలంగాణలో ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్‌, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు

పైగా దొంగతనం చేసిన ఆ గాడిద ఎక్కడిది?? దాని ఓనర్ ఎవరు?? అనే విషయాలను వెంకట్ ని పలుమార్లు ప్రశ్నించినా ఆయన నుంచి సమాధానం రాలేదని దీంతో కేసు నమోదు చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. మరోవైపు గాడిదను ఎక్కడ నుండి తెచ్చారనే అంశంపై విచారణ జరుపుతున్నామని అన్నారు. గాడిదను కొన్ని బలహీన వర్గాలకు చెందిన సంచార జాతులకు చెందిన ప్రజలు తమ రోజువారీ పనుల కోసం వాడుకుంటుంటారు. అలాంటిది ఆయన గాడిదను ఎక్కడి నుంచి తెచ్చారో తెలియరాలేదన్నారు.జంతువులను దొంగతనం చేసి తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వెంకట్ హింసించి అవమానించారని తెలిపారు.

Chittoor Road Accident: ఘోర రోడ్డు ప్రమాదాలు, ఎనిమిది మంది మృతి, చిత్తూరు జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, నలుగురు అక్కడికక్కడే మృతి, అదిలాబాద్, నాగర్‌ కర్నూల్‌ జిల్లా రోడ్డు ప్రమాదాల్లో మరో నలుగురు మృతి

మరోవైపు సమాజంలోని వివిధ వర్గాల మధ్య రెచ్చగొట్టే చర్యలకు పూనుకోవడమే కాకుండా వైషమ్యాలను పెంచుతున్నారని పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని వెంకట్ పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యానిమల్స్ యాక్ట్‌లయిన Cr.No: 74/2022 u/s 143,153,379,429, r/w 149 Sec 11 of cruelty of Animal Act కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

బల్మూర్ వెంకట్ NSUI రాష్ట్ర నేతగా ఈమధ్య పలు ధర్నా లలో చురుగ్గా పాల్గొనడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థి నాయకులను కో ఆర్డినేట్ చేసుకుంటూ అనేక అంశాలపై ప్రభుత్వం పైన విరుచుకు పడుతున్నారు. ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా నిలబడ్డారు. చిన్న వయసులోనే కీలకమైన పదవికి పోటీలో పాల్గొన్నారు. ఆ సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పై, టీఆర్ఎస్ నాయకులపై పలుమార్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బల్మూరి వెంకట్ వినూత్న నిరసన చేశారు. ఓ గాడిదకు సీఎం ఫోటో తగిలించి కేకు తినిపించారు. దీన్ని ఆయన ట్వీట్ చేశారు.