High Court of Telangana | (Photo-ANI)

Hyd, Feb 18: తెలంగాణలో ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియకు హైకోర్టు (Telangana high court ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. భూములను విక్రయించడానికి వీల్లేదని చట్టంలో ఎక్కడా లేదని, ఈ నేపథ్యంలో తాము వేలం ప్రక్రియను ( sale of government lands in the State) నిలిపి వేయలేమని స్పష్టం చేసింది.

అయితే టెండర్లు, ఈ వేలం లాంటి పారదర్శక పద్ధతుల్లో భూములను వేలం (Government Lands Sale) వేయాలని తేల్చిచెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు తీర్పునిచ్చింది.భూముల వేలాన్ని నిలిపివేయాలంటూ మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు విజయశాంతి శుక్లా దాఖలు చేసిన పిల్‌ను కొట్టివేసింది. కోకాపేట, ఖానామెట్‌లో ప్రభుత్వ భూములను అక్రమార్కుల నుంచి కాపాడలేకపోతున్నామని పేర్కొంటూ ప్రభుత్వం వేలం వేయడాన్ని విజయశాంతి సవాల్‌ చేశారు.

గద్దెల మీదకు సమ్మక్క తల్లి, జాతరలో కీలక ఘట్టం పూర్తి, మొక్కులు సమర్పించుకుంటున్న భక్తులు, కోలాహలంగా మేడారం

అయితే ఏ చట్టం ప్రకారం ప్రభుత్వ భూములను విక్రయించరాదో చెప్పాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. భూముల విక్రయ నిషేధానికి ఎలాంటి చట్టం లేనప్పుడు తాము భూముల వేలాన్ని నిలిపివేస్తూ ఎలా ఉత్తర్వులు జారీ చేయగలమని ప్రశ్నించింది.

తెలంగాణలో కొత్తగా 453 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 134 కొత్త కేసులు

ఇక రక్షణ శాఖకు చెందిన భూముల్లో కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా వాటి జోలికి వెళ్లడానికి వీల్లేదని, నిర్మాణాలు చేపట్టరాదని తేల్చిచెప్పింది. సికింద్రాబాద్‌ బైసన్‌ పోలో, జింఖానా మైదానంలో సచివాలయం, ఇతర నిర్మాణాలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మాజీ డీజీపీ ఎంవీ భాస్కర్‌రావుతో పాటు మరికొందరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.

అయితే ప్రస్తుతం సచివాలయం ఉన్న ప్రాంతంలోనే నూతన సచివాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని, బైసన్‌ పోలో, జింఖానా మైదానంలో నిర్మాణాలు చేపట్టాలన్న ప్రతిపాదనను ఉపసంహరించు కుందని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. దీంతో ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణను ముగించింది.

యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తాం, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు, నోటీసులు జారీ చేసిన ఈసీ

సచివాలయం నిర్మాణానికి నిధులుంటాయి. హైకోర్టులో అదనపు భవనాల నిర్మాణానికి మాత్రం నిధులు లేవా? నూతనంగా వస్తున్న న్యాయమూర్తులకు కోర్టు హాళ్లు, చాంబర్లు లేవు. పరిస్థితి ఇలాగే ఉంటే ఏజీ, బార్‌ కౌన్సిల్‌ కార్యాలయాలను కూడా ఖాళీ చేయించాల్సి ఉంటుంది..’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు సమీపంలో 100 ఎకరాల భూమి కేటాయించిందని, అయితే అక్కడ నిర్మాణాలకు హైకోర్టు సుముఖంగా లేదని ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చారు.