BJP MLA Raja Singh (Photo Credits: Facebook/ Raja Singh)

Hyd, Feb 16: యూపీలో యోగి ఆదిత్యనాథ్ కు ఓటు వేయని వారి ఇళ్లపైకి జేసీబీలను, బుల్డోజర్లను పంపిస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించి రాజాసింగ్ కు ఎన్నికల సంఘం నోటీసులు (Election Commission issues notice to BJP's T Raja Singh) పంపించింది. మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలియజేయాలని నోటీసులో పేర్కొంది. యూపీలో బీజేపీకి ఓటు వేయాలని (threatening voters in UP) రాజాసింగ్ బెదిరించినట్లు ఆ నోటీసులో పేర్కొంది.24 గంటల్లో సమాధానం చెప్పాలని డెడ్ లైన్ విధించింది.

ఈ నేపథ్యంలో రాజాసింగ్ స్పందిస్తూ... కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తన ఆఫీసుకు నోటీసులు వచ్చినట్టు ఇప్పుడే తెలిసిందని అన్నారు. గతంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఉన్న సమయంలో యూపీలో ఎన్నో అరాచకాలు జరిగాయని... ఆ అరాచకాలను వివరించే ప్రయత్నమే తాను చేశానని చెప్పారు. ఆవు మాంసం తినేవారు తనపై కుట్ర చేస్తున్నారని అన్నారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరోసారి రావాలని హోమం నిర్వహించేందుకు ఉజ్జయిని వెళ్తున్నానని చెప్పారు. ఈసీ ఇచ్చిన నోటీసులకు తన లాయర్ ద్వారా వివరణ ఇస్తానని తెలిపారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో ఏడు విడుతల్లో ఎన్నికల జరుగుతుండగా.. ఇప్పటికే రెండు విడుతల పోలింగ్‌ పూర్తయ్యింది.

తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపేస్తారు, కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో చెప్పే దమ్ముందా?, ప్రధాని మోదీ, బీజేపీపై విరుచుకుపడిన తెలంగాణ మంత్రి కేటీఆర్

పలు ప్రాంతాల్లో అత్యధికంగా ఓటింగ్‌ నమోదైంది. ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయని, ఈ క్రమంలో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ‘యూపీలో బీజేపీకి, యోగికి ఓటు వేయనివారిని గుర్తించి, వాళ్ల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపిస్తామంటూ’ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ‘ఉత్తరప్రదేశ్‌లో ఉండాలనుకున్నారా? లేదా? బిడ్డా.. యోగి అధికారంలోకి రాకపోతే మీరంతా యూపీని వదిలి పారిపోవాలి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసిందని.. మూడో విడత పోలింగ్‌లో కచ్చితంగా హిందువులంతా ఏకమై యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయాలని, ‘ఎన్నికల్లో యోగికి ఓటు వేయనివారంతా ద్రోహులు’ అన్నారు. ‘వారికి ఉత్తర ప్రదేశ్‌లో స్థానం లేదు’.. యోగికి ఓటు వేయని వారిని తరిమి తరిమి కొడతాం’ అంటూ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు పలు జాతీయ చానెళ్లలో ప్రసారం కాగా.. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసింది.