Dr S.I.Padmavati Passed Away: డా. ఎస్ఐ పద్మావతి కరోనాతో కన్నుమూత, దేశంలో తొలి మహిళా కార్డియాలజిస్ట్‌గా ప్రఖ్యాతి గాంచిన శివరామకృష్ణ అయెర్ పద్మావతి
ఎస్ పద్మావతి కరోనాతో (S.I.Padmavati Dies of COVID-19) మరణించారు. శతాధిత వృద్ధురాలైన ఎన్‌హెచ్ఐ స్థాపకులు పద్మావతి (Sivaramakrishna Iyer Padmavati) తన 103 ఏట కోవిడ్ మహమ్మారి వల్ల ఆగస్టు 29న మరణించారు. న్యూఢిల్లీలోని నేషనల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌హెచ్ఐ)లో 11 రోజులపాటు చికిత్స పొందిన ఆమె శనివారం కన్నుమూశారని డాక్టర్లు తెలిపారు. ఢిల్లీలోని పంజాబీ బాఘ్‌లో నిన్న అంత్మక్రియలు ముగిశాయి.
New Delhi, August 31: ప‌్రముఖ హృద్రోగ నిపుణురాలు, దేశంలో తొలి మహిళా కార్డియాలజిస్ట్, డా. ఎస్ పద్మావతి కరోనాతో (S.I.Padmavati Dies of COVID-19) మరణించారు. శతాధిత వృద్ధురాలైన ఎన్‌హెచ్ఐ స్థాపకులు పద్మావతి (Sivaramakrishna Iyer Padmavati) తన 103 ఏట కోవిడ్ మహమ్మారి వల్ల ఆగస్టు 29న మరణించారు. న్యూఢిల్లీలోని నేషనల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌హెచ్ఐ)లో 11 రోజులపాటు చికిత్స పొందిన ఆమె శనివారం కన్నుమూశారని డాక్టర్లు తెలిపారు. ఢిల్లీలోని పంజాబీ బాఘ్‌లో నిన్న అంత్మక్రియలు ముగిశాయి.
దేశంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ (India's First Woman Cardiologist) అయిన డా. పద్మావతిని గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీగా (Godmother of cardiology) ప్రఖ్యాతి గడించారు. డా. పద్మావతి 1917లో బర్మా (మయన్మార్)లో జన్మించారు. అంటే సరిగ్గా స్పానిష్ ఫ్లూ మహమ్మారి విజృంచడానికి ఏడాది ముందు పద్మావతి జన్మించారు. మళ్లీ వందేండ్ల తర్వాత వచ్చిన మరో కరోనా మహమ్మారి బారినపడి ఆమె మరణించారు. దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు, ఇప్పటివరకు 27,74,802 మంది డిశ్చార్జ్, 7,81,975 యాక్టివ్ కేసులు, తాజాగా 78,512 మందికి కోవిడ్-19
ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకడంతో ఆరోగ్య పరిస్థితి విషమించిందని ఎన్‌హెచ్ఐ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఓపీ యాదవ్ తెలిపారు. రెండు ఊపిరితిత్తులలోనూ తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ ఏర్పడిందని తెలిపారు. పద్మావతి మరణానికి అదే కారణమైందని చెప్పారు. రెండురోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందించామని, అయినప్పటికీ.. ఫలితం రాలేదని అన్నారు. వైద్యానికి ఆమె శరీరం స్పందించడం మానేసిందని చెప్పారు. ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన అమిత్ షా
2015 చివరి వరకు కార్డియాలజిస్ట్‌గా సేవలను అందించారు. నేషనల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకురాలిగా పేరు తెచ్చుకున్నారు. 1981లో నెలకొల్పిన ఈ ఇన్‌స్టిట్యూట్‌లో రోజూ 12 గంటల పాటు పనిచేసేవారని ఓపీ యాదవ్ తెలిపారు. వైద్యరంగంలో గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీగా గుర్తింపు పొందారు. 1967లో మౌలానా ఆజాద్ వైద్య కళాశాల డైరెక్టర్ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. ఇర్విన్ అండ్ జీబీ పంత్ ఆసుపత్రితో కలిసి హృద్రోగంలో పరిశోధనలు కొనసాగించారు. 1962 ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్‌ను స్థాపించారు. వైద్యరంగంలో ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.