Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, August 31: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,512 పాజిటివ్‌ కేసులు (COVID-19 New Cases in India) నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 36,21,246 చేరింది. ఆదివారం ఒక్కరోజే కోవిడ్‌ బాధితుల్లో 971 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 64,469 కు (Coivd Deaths) చేరింది. భారత్‌లో ప్రస్తుతం 7,81,975 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 27,74,802 మంది కోవిడ్‌ రోగులు కోలుకున్నారు.

వారం రోజులు భారీ సంఖ్య‌లో కేసులు (Coronavirus in India) న‌మోద‌వుతుండ‌టంతో దేశంలో గ‌డ‌చిన వారం రోజుల్లో 13.1శాతానికి పెరిగాయి. నిన్న ఒకేరోజు 8,46,278 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ICMR) ప్ర‌క‌టించింది. అదేవిధంగా ఆగ‌స్టు 30 వ‌ర‌కు 4,23,07,914 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2.5 కోట్లు దాటింది. అమెరికాలో అత్యధికంగా 61.41 లక్షల కేసులు నమోదు కాగా, 38.48 లక్షల కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో, 35 లక్షల కేసులతో భారత్‌ మూడో స్థానంలో ఉన్నది. మొత్తం కేసుల్లో 53.6 శాతం కేసులు ఈ మూడు దేశాల్లోనే నమోదయ్యాయి. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా మరణాలు 8.47 లక్షలు దాటాయి. కరోనాతో అమెరికాలో 1.86 లక్షలు, బ్రెజిల్‌లో 1.20 లక్షలు, భారత్‌లో 63,498 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కొవిడ్‌ మరణాల్లో 43.79 శాతం మరణాలు ఈ మూడు దేశాల్లోనే రికార్డయ్యాయి. ఇప్పటివరకూ 1.75 కోట్ల మంది కోలుకున్నారు. సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు‌, కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు సర్కారు, ఈ పాస్ విధానాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సీఎం ఎడప్పాడి కె పళనిస్వామి

తమిళనాడులో గడిచిన 24 గంటల్లో రాష్ర్టంలో 6,495 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 4,22,085కు చేరింది. ఇవాళ 94 మంది వ్యాధి బారిన పడి మరణించగా.. ఇప్పటివరకు 7,231మంది మృత్యువాత పడ్డారని రాష్ర్ట వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 3,62,133 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 52,721 యాక్టీవ్‌ కేసులున్నాయి.