Chennai, August 30: తమిళనాడులో కరోనా విలయం కొనసాగుతోంది. రాష్ర్టంలో ప్రతిరోజు వేలల్లో కేసులు నమోదు అవుతుండగా.. మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు (Tamil Nadu Lockdown Extension) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి ఆదివారం తెలిపారు. అయితే సడలింపు నిబంధనల ప్రకారం ఆదివారాల్లో పూర్తిగా లాక్‌డౌన్ ఉండదని చెప్పారు.
అంతర జిల్లాల ప్రయాణాలకు ప్రవేశపెట్టిన ఈ పాస్ విధానాన్ని నిలిపివేస్తున్నట్లు సీఎం (Edappadi K. Palaniswami) వెల్లడించారు. అలాగే ఇతర రాష్ట్రాలు మరియు విదేశాల నుండి వచ్చే ప్రజలకు ఇ-పాస్ తప్పనిసరి అని తెలిపారు. అన్ని ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రిసార్టులకు అనుమతిస్తున్నట్లు సీఎం పళనిస్వామి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్‌లాక్ 4 మార్గదర్శకాలు, నిబంధనలను రాష్ట్ర ప్రజలు పాటించాలని పేర్కొన్నారు. జిల్లాల కలెక్టర్ల నుండి సేకరించిన ఈ-పాస్ తో (e-pass) పర్యాటకులను అనుమతిస్తారు. రైతులుంటేనే దేశం, కరోనా కాలంలో రైతులు పడుతున్న కష్టాన్ని కొనియాడిన ప్రధాని మోదీ, 68వ మనకీ బాత్ కార్యక్రమంలో జాతి నుద్దేశించి ప్రసంగించిన ప్రధాని
ఇంట్రా-స్టేట్ బస్సు సర్వీసు సెప్టెంబర్ 1 నుండి తిరిగి ప్రారంభించనున్నారు, చెన్నై మెట్రో సెప్టెంబర్ 7 నుండి తిరిగి కార్యకలాపాలు ప్రారంభించడానికి అనుమతించబడింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పెద్ద షోరూమ్‌లు, షాపింగ్ మాల్‌లు తిరిగి తెరవడానికి అనుమతించబడ్డాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్ళు, ఈత కొలనులు, వినోద ఉద్యానవనాలు, బీచ్‌లు, జంతుప్రదర్శనశాలలు, మ్యూజియంలు, పర్యాటక ప్రదేశాలు తిరిగి ప్రారంభించబడవు. రెండోసారి కరోనా రావడంపై క్లారిటీ ఇచ్చిన శాస్త్రవేత్తలు, దేశంలో తాజాగా 78,761 కేసులు నమోదు, ఇప్పటివరకు 27,13,934 మంది కోలుకుని డిశ్చార్జ్
గడిచిన 24 గంటల్లో రాష్ర్టంలో 6,495 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 4,22,085కు చేరింది. ఇవాళ 94 మంది వ్యాధి బారిన పడి మరణించగా.. ఇప్పటివరకు 7,231మంది మృత్యువాత పడ్డారని రాష్ర్ట వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు 3,62,133 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 52,721 యాక్టీవ్ కేసులున్నాయి.