Draupadi Murmu Oath Ceremony: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పదవీ బాధ్యతలు, ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించిన సీజేఐ ఎన్వీ రమణ
అనంతరం పదవీ పత్రాలపై ఆమె సంతకాలు చేశారు.అంతకుముందు రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము పార్లమెంట్‌కు చేరుకున్నారు.
భారత దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం చేశారు, భారత దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమె చేత ప్రమాణం చేయించారు. అనంతరం పదవీ పత్రాలపై ఆమె సంతకాలు చేశారు.అంతకుముందు రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము పార్లమెంట్‌కు చేరుకున్నారు. వారి వెంట సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఉన్నారు.
ముర్ముకు త్రివిధ దళాల బృందం గన్ సెల్యూట్ చేసింది. రాష్ట్రపతి ఫోర్‌కోర్టులో రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము గౌరవ వందనం స్వీకరించారు.తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26న ప్రమాణం చేశారు. అయితే.. 1977 తర్వాత జూలై 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న పదో రాష్ట్రపతిగా ముర్ము చరిత్రలో నిలిచిపోనున్నారు. నీలం సంజీవరెడ్డి ఆరవ రాష్ట్రపతిగా 1977 సంవత్సరం జూలై 25న ప్రమాణం చేశారు.
64 ఏళ్ల ఒడిశా ట్రైబల్ లీడర్ ( Tribal Leader ).. తన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్ (Mayur bhanj) జిల్లాలో జన్మించారు. శ్యామ్ చరణ్ ముర్మును వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అయితే భర్త, కుమారులు ఇద్దరూ చనిపోవడంతో ఆమె జీవితంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఆ తర్వాత ప్రజాసేవకే ఆమె జీవితాన్ని అంకితం చేశారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన మరియు గిరిజన సంఘం నుండి వచ్చిన ముర్ము ఉపాధ్యాయురాలిగా ప్రారంభించి ఒడిశా రాజకీయాల్లోకి ప్రవేశించారు.