CEC Sushil Chandra Covid: చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సుశీల్‌ చంద్రకు కరోనా, ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌‌కు సైతం కోవిడ్, హోమ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిన ఎన్నికల ప్రధాన అధికారులు

ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సైతం కరోనా ( Election Commissioner Rajiv Kumar tests positive Covid-19 ) బారీన పడ్డారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ అధికార ప్రతినిధి మంగళవారం తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరూ ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.

Election Commissioner Sushil Chandra. (Photo Credits: ANI|File)

New Delhi, April 20: చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సుశీల్‌ చంద్ర కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ (CEC Sushil Chandra Covid) అయింది. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సైతం కరోనా ( Election Commissioner Rajiv Kumar tests positive Covid-19 ) బారీన పడ్డారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ అధికార ప్రతినిధి మంగళవారం తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరూ ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.

కాగా వారం రోజుల కిందట సుశీల్‌ చంద్ర సీఈసీగా (Chief Election Commissioner (CEC) Sushil Chandra) బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. గత సోమవారం సునీల్‌ అరోరా పదవీ విరమణ చేయడంతో.. ఆయన 24వ ముఖ్య ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ముగ్గురు సభ్యులుండే కేంద్ర ఎన్నికల సంఘంలో సునీల్‌ అరోరా పదవీ విరమణతో సుశీల్‌ చంద్ర, రాజీవ్‌ కుమార్‌ ఇద్దరే ఉన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌కు కరోనా, తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరిన కేంద్ర మంత్రి

లోక్‌సభ ఎన్నికలకు ముందే 2019 ఫిబ్రవరి 14న సుశీల్‌ చంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియామకమయ్యారు. మే 14, 2022 వరకు పదవిలో కొనసాగనున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

రాహుల్‌ గాంధీకి కరోనా పాజిటివ్, తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు

గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్‌ అసెంబ్లీల పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది మే 14న ముగియనుంది. సుశీల్‌ చంద్ర భారత రెవెన్యూ సర్వీస్‌కు చెందిన 1980 బ్యాచ్‌కు చెందిన అధికారి.