5 States Elections: ర్యాలీలు, రోడ్ షోలపై నిషేదం పొడిగింపు, ఈ నెల 22 వరకు సభలు, రోడ్ షోలు రద్దు, కోవిడ్ తగ్గకపోవడం ఈసీ నిర్ణయం, డిజిటల్ ప్రచారం చేసుకోవాలంటూ సూచన
ఇంటింటి ప్రచారాన్ని కూడా ఐదుగురికి మించి ఉండకుండా చూసుకోవాలి. గతంతో జనవరి 15 వరకు ఆంక్షలను విధించిన ఈసీ, వాటిపై సమీక్ష జరిపింది.
New Delhi January 15: ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం(5 States Elections Campagain)పై ఈసీ విధించిన కోవిడ్ నిబంధనలను పొడిగించింది. కరోనా వ్యాప్తి(Corona) ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో కోవిడ్ ఆంక్షలను(Covid restrictions) ఈ నెల 22 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ర్యాలీలు(poll rallies), రోడ్ షోలు(roadshows ), పాదయాత్రలు, బహిరంగసభలను నిర్వహించకూడదు. ఇంటింటి ప్రచారాన్ని కూడా ఐదుగురికి మించి ఉండకుండా చూసుకోవాలి. గతంతో జనవరి 15 వరకు ఆంక్షలను విధించిన ఈసీ, వాటిపై సమీక్ష జరిపింది. కరోనా తీవ్రత తగ్గకపోవడంతో పొడిగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్(Uttarapradesh), ఉత్తరాఖండ్(Uttarakhand), గోవా(Goa), పంజాబ్(Punjab), మణిపూర్ (Manipur) రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే కోవిడ్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో ప్రచారం జరిగే తీరుపై ఆంక్షలను విధించింది. అభ్యర్ధులు, పార్టీలు డిజిటల్ ప్రచారానికే ఎక్కువగా మొగ్గు చూపించాలని ఈసీ కోరింది. ప్రచారంలో కోవిడ్ నిబంధనలను పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపింది. ఈసీ ఆంక్షలతో ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ప్రధాన నేతల పర్యటనలు రద్దయ్యాయి. అభ్యర్ధులు కేవలం ఇంటింటి ప్రచారం మాత్రమే చేస్తున్నారు.