Notification For First Phase: లోక్ సభ ఎన్నికల్లో తొలి ఘట్టం మొదలు, ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ కు నోటిఫికేషన్ జారీ, తొలి దశలో ఏయే స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయంటే?
దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజక వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించేందుకు మార్చి 27 గడువు. 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.
New Delhi, March 20: సార్వత్రిక ఎన్నికలకు (Lok sabha Elections 2024) తొలి నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజక వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించేందుకు మార్చి 27 గడువు. 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 30వ తేదీలోగా ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 19న ఈ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది.
ఎన్నికలు జరగనున్న వాటిలో తమిళనాడులోని 39, రాజస్థాన్‌లోని 12, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 8, మధ్యప్రదేశ్‌లోని 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాంలలోని ఐదేసి, బిహార్‌లోని 4, పశ్చిమ బెంగాల్‌లోని 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, మేఘాలయల్లో రెండేసి, ఛత్తీస్‌గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.