లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ఆరు రాష్ట్రాల హోం శాఖ కార్య‌ద‌ర్శుల‌ను తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. గుజ‌రాత్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్, జార్ఖండ్‌, ఉత్త‌రాఖండ్, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌ హోం శాఖ కార్య‌ద‌ర్శుల‌ను ఈసీ తొల‌గించింది. అలాగే మిజోరం, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాల్లోని సీనియ‌ర్ అధికారుల‌పై కూడా వేటు వేసింది. వెస్ట్ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను కూడా ఈసీ తొల‌గించింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చాక ఈసీ తొలిసారిగా చ‌ర్య‌లు తీసుకుంది. బృహ‌న్ ముంబై కార్పొరేష‌న్ అధికారుల‌పైనా కూడా ఈసీ వేటు వేసింది. బీఎంసీ క‌మిష‌న‌ర్, అద‌న‌పు, డిప్యూటీ క‌మిషన‌ర్ల‌ను ఈసీ తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)