Electoral Bonds: ఎన్నికల బాండ్లపై పూర్తి డేటా ఇవ్వని ఎస్‌బీఐ, ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, ఈ నెల 18లోగా సమాధానం చెప్పాలని ఆదేశాలు, ఎన్నికల బాండ్లు ఏ పార్టీకి ఎన్ని అందాయంటే..
రాజకీయ పార్టీలు స్వీకరించిన ఎలక్టోరల్ బాండ్ల విశిష్ట ఆల్ఫా-న్యూమరిక్ నంబర్‌లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వెల్లడించాల్సిందిగా సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది.ర్టు ఆదేశాల ప్రకారం బాండ్ల పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి (EC) ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది.
న్యూఢిల్లీ, మార్చి 15: రాజకీయ పార్టీలు స్వీకరించిన ఎలక్టోరల్ బాండ్ల విశిష్ట ఆల్ఫా-న్యూమరిక్ నంబర్‌లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వెల్లడించాల్సిందిగా సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది.ర్టు ఆదేశాల ప్రకారం బాండ్ల పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి (EC) ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. దీనిపై ఆ బ్యాంక్‌కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది.
ఎన్నికల బాండ్లపై కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్లను ఎస్‌బీఐ తమకు సమర్పించలేదని ఈసీ (EC) న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో బ్యాంకుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘బాండ్ల నంబర్లు (Electoral Bonds) లేకపోవడంతో ఎవరు ఎవరికి ఎంత ఇచ్చారన్నది స్పష్టంగా తెలియడం లేదు. అన్ని వివరాలను వెల్లడించాలని మేం తీర్పులోనే పేర్కొన్నా.. మీరు ఎందుకు ఇవ్వలేదు’’ అని కోర్టు ప్రశ్నించింది.
దీనిపై బ్యాంక్‌కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది. ఆలోగా తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఎస్‌బీఐని ఆదేశించింది. ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను సోమవారం నాటికి ఈసీకి అందజేయాలని స్పష్టం చేసింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ వివరాలను ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన సుఖ్‌బీర్, జ్ఞానేశ్‌కుమార్
2019 ఏప్రిల్ 12 నుంచి 2024 జనవరి 24 మధ్య కాలంలో వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఎస్బీఐ విక్రయించిన బాండ్ల వివరాలు ఇందులో ఉన్నాయి. రెండు భాగాలుగా బాండ్ల వివరాలను వెల్లడించింది. ఒక భాగంలో ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన దాతలు, సంస్థల వివరాలు ఉన్నాయి. రెండో భాగంలో ఈ బాండ్ల ద్వారా నిధులు పొందిన రాజకీయ పార్టీల వివరాలను వెల్లడించింది. మొత్తం 337 పేజీల డేటాను వెబ్‌సైట్‌లో ఉంచింది. రూ.11,671 కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేసినట్లు ఈ డేటా ద్వారా వెల్లడైంది. అయితే, ఇలా వేర్వేరుగా వివరాలను ఇవ్వడం వల్ల ఏ పార్టీకి ఎవరెవరు నిధులు ఇచ్చారు ? ఎన్ని నిధులు ఇచ్చారు ? అనే వివరాలు వెల్లడి కాలేదు.
దేశంలోనే అత్యధికంగా అధికార భారతీయ జనతా పార్టీ రూ.60,60.5 కోట్లను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందుకుంది.తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రూ.1600 కోట్లకుపైగా, కాంగ్రెస్ పార్టీకి రూ.1400 కోట్లకుపైగా నిధులు బాండ్ల ద్వారా అందాయి.అన్ని పార్టీలకు ఆయా పార్టీల పేర్ల మీద ఎన్నికల బాండ్లు అందగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలకు మాత్రం అధ్యక్షుల పేర్లతో బాండ్లు అందాయి.
ఎక్కువ ఎలక్టోరల్ బాండ్లను కోయంబత్తూరు కేంద్రంగా పని చేసే ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ కొనుగోలు చేసింది. వేర్వేరు పేర్లతో ఈ సంస్థ కేరళ, సిక్కిం తదితర రాష్ర్టాల్లో లాటరీ వ్యాపారం నిర్వహిస్తున్నది. ఈ సంస్థ రూ.1,368 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. లాటరీ కింగ్‌గా పేరున్న మార్టిన్ శాన్‌టియాగో ఈ సంస్థకు యాజమాని. ఈ సంస్థపై మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ విచారణ జరుపుతున్నది.
బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీల్లో స్టీల్ పారిశ్రామిక దిగ్గజం లక్ష్మీ మిట్టల్ నుంచి బిలియనీర్ సునీల్ భారతీ మిట్టల్ , అనిల్ అగర్వాల్, ఐటీసీ, మహీంద్ర అండ్ మహీంద్ర, కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజినీరింగ్, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్, అంతగా పేరులేని ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీలున్నాయి. ముంబయికి చెందిన క్విక్ సప్లై చైన్ సంస్థ రూ.410 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత రూ.400 కోట్ల బాండ్లను కొనుగోలు చేసింది. హల్దియా ఎనర్జీ సంస్థ రూ.377 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. గాజియాబాద్ కేంద్రంగా పనిచేసే యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రూ.162 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది.
స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ తన సొంత డబ్బు రూ.35 కోట్లతో బాండ్లను కొన్నారు. దీంతోపాటు ఆయన కంపెనీలు మరో రూ.247 కోట్ల విలువైన బాండ్లను కొన్నాయి. ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ విరాళం రూ.224 కోట్లు. వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్స్‌మిషన్: రూ.220 కోట్లు. కెవెంటర్ ఫుడ్ పార్క్ ఇన్‌ఫ్రా లిమిటెడ్: రూ.194 కోట్లు. మదన్‌లాల్ లిమిటెడ్: రూ.185 కోట్లు. డీఎల్‌ఎఫ్ గ్రూప్: రూ.170 కోట్లు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్: రూ.123 కోట్లు. బిర్లా కార్బన్ ఇండియా: రూ.105 కోట్లు. రుంగ్తా సన్స్: రూ.100 కోట్లు. కిరణ్ మజుందార్ షా, వరుణ్ గుప్తా, బీకే గోయెంకా, జైనేంద్ర షా, మోనికా వ్యక్తిగతంగా బాండ్లను కొన్నారు. బజాజ్ ఆటో రూ.18 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ.20 కోట్లు, ఇండిగో సంస్థలు రూ.36 కోట్లు, స్పైస్‌జెట్ రూ.65 లక్షల బాండ్లను కొన్నాయి. ఇండిగో సంస్థకు చెందిన రాహల్ భాటియా రూ.20 కోట్ల బాండ్లను కొన్నారు. రూ.10లక్షల విలువైన బాండ్లను 4,620 మంది, రూ.లక్ష విలువైన బాండ్లను 2,228 మంది కొనుగోలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ రాజకీయ పార్టీలకు రూ.966 కోట్ల విరాళం ఇచ్చింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటివరకూ ఆ సంస్థ కోటి రూపాయల విలువైన 966 బాండ్లను కొనుగోలు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసిన జాబితా ద్వారా వెల్లడైంది. షిర్డీసాయి ఎలక్ట్ట్రికల్స్ లిమిటెడ్ ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఒక్క రోజే రూ.కోటి విలువైన 40 బాండ్లను కొనుగోలు చేసి రూ.40 కోట్ల విరాళం ఇచ్చింది.
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్: రూ.80 కోట్లు, నాట్కోఫార్మా: రూ.70 కోట్లు,ఎన్‌సీసీ లిమిటెడ్: రూ.60 కోట్లు,హెటిరో గ్రూప్: రూ.60 కోట్లు,నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్: రూ.55 కోట్లు, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్: రూ.55 కోట్లు,అరబిందో ఫార్మా లిమిటెడ్: రూ.50 కోట్లు,రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్: రూ.45 కోట్లు,గ్రీన్‌కో: రూ.35 కోట్లు,అపర్ణా ఫామ్స్ అండ్ ఎస్టేట్స్ సంస్థ: రూ.30 కోట్లు,ఎన్‌ఎస్‌ఎల్ ఎస్‌ఈజెడ్ హైదరాబాద్ ప్రైవేట్ లిమిటెడ్: రూ.29 కోట్లు,కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్: రూ.26.50 కోట్లు,మైహోం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్: రూ.25 కోట్లు,రాజపుష్ప గ్రూప్: రూ.25 కోట్లు, ఏపీఎల్ హెల్త్‌కేర్ లిమిటెడ్: రూ.10 కోట్లు,నారా కన్‌స్ట్రక్షన్స్: రూ.10 కోట్లు,భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్: రూ.10 కోట్లు,సోమశిల సోలార్ పవర్ లిమిటెడ్: రూ.7 కోట్లు,శ్రీచైతన్య స్టూడెంట్స్ మేనేజ్‌మెంట్: రూ.6 కోట్లు,సుధాకర్ కంచర్ల: రూ.5 కోట్లు,కేసీఆర్ ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ: రూ.5 కోట్లు, ఐల్యాబ్స్ హైదరాబాద్ టెక్నాలజీ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్: రూ.5 కోట్లు.,వైసీపీకు రూ.337 కోట్లు, టీడీపీకి రూ.219 కోట్లు, జనసేనకు రూ.21 కోట్లు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి రూ.1,215 కోట్ల విరాళాలు అందాయి.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)