సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించడం తెలిసిందే. ఆయా పార్టీల ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నేడు బహిర్గతం చేసింది. ఎస్బీఐ ఈ నెల 11న ఎలక్టోరల్ బాండ్ల వివరాలను తమకు సమర్పించిందని ఈసీఐ వెల్లడించింది. ఆ వివరాలను వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేశామని, https://www.eci.gov.in/candidate-politicalparty లింకు ద్వారా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను తెలుసుకోవచ్చని ఈసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.ఎస్బీఐ ఏ వివరాలు అయితే సమర్పించిందో ఆ వివరాలనే బహిర్గతం చేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ అంశంలో తాము పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొంది.

Here's Electoral Bonds Data 

electoral bond donors by Srishti Kapoor

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)