ED Action Under PMLA: విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు షాకిచ్చిన ఈడీ, రూ.9,371.17 కోట్ల విలువైన వారి ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ, రూ.18,170.02 కోట్ల ఆస్తులు సీజ్ చేసిన‌ట్లు తెలిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్‌

రూ.9,371.17 కోట్ల విలువైన ఆస్తులను బదిలీ చేసినట్లు బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో వివరించింది.

ED Representative Image

New Delhi, June 23: బ్యాంకులను మోసగించి, పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల (Mehul Choksi, Nirav Modi, Vijay Mallya) నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (Enforcement Directorate)ప్రకటించింది. రూ.9,371.17 కోట్ల విలువైన ఆస్తులను బదిలీ చేసినట్లు బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో వివరించింది.

అంతేకాదు ఈ ముగ్గురికి చెందిన సుమారు రూ.18,170.02 కోట్ల ఆస్తుల‌ను సీజ్ చేసిన‌ట్లు ఈడీ చెప్పింది. దీంట్లో విదేశాల్లో ఉన్న రూ.969 కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి. ముగ్గురి వ‌ల్ల బ్యాంకుల‌కు జ‌రిగిన న‌ష్టంలో వారి ఆస్తులు అటాచ్ చేసి, సీజ్ చేసిన మొత్తం విలువ 80.45 శాతంగా ఉన్న‌ట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్‌ చెప్పింది.

వ్యాపార‌వేత్త‌లు విజ‌య్ మాల్యా, నీర‌వ్ మోదీ, మెహుల్ చోక్సీలు.. భార‌తీయ బ్యాంకుల‌కు వేల కోట్ల రుణాలు ఎగ‌వేసిన విష‌యం తెలిసిందే. నీర‌వ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజ‌య్ మాల్యాలు.. ప్ర‌స్తుతం విదేశాల్లో ఉన్నారు. వారిని ఇండియాకు ర‌ప్పించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అయితే ఈ ముగ్గురూ భార‌తీయ బ్యాంకుల నుంచి సుమారు రూ.22,585 కోట్లు రుణం తీసుకున్నారు. సీబీఐ న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ ముగ్గురికి చెందిన లావాదేవీల‌ను స‌మీక్షించింది.

చాపకింద నీరులా డెల్టా ప్ల‌స్ వేరియంట్, దేశంలో 40కిపైగా కేసులు గుర్తింపు, ధర్డ్ వేవ్‌కి దారి తీసే అవకాశం ఉందంటున్న నిపుణులు, లక్షణాలు ఎలా ఉంటాయి, వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా ఓ సారి చూద్దాం

డ‌మ్మీ సంస్థ‌ల‌తో ఈ ముగ్గురు బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్న‌ట్లు ఈడీ చెప్పింది. విజ‌య్ మాల్యాను అప్ప‌గించేందుకు బ్రిట‌న్ కోర్టు అంగీక‌రించింది. భారత దేశానికి అప్పగించడానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అపీలు చేయడానికి మాల్యాకు అనుమతి లభించలేదు.ముగ్గురికి చెందిన ఆస్తుల‌ను త్వ‌ర‌లో వేలం వేయ‌నున్నారు. దాని ద్వారా ఆయా బ్యాంకుల‌కు సుమారు రూ.7981 కోట్లు జ‌మ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

మీ డబ్బులు పైసాతో సహా చెల్లిస్తా..నన్ను వదిలేయండి, యుకే కోర్టు బయట విజయ్ మాల్య, తనపై ఈడీ కక్ష గట్టిందంటూ ఆరోపణలు, మాకు ఆయన్ని అప్పగించమంటున్న ఈడీ

మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి రూ.18,170.02 కోట్లు స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాకుండా, దీనిలో కొంత భాగం అంటే రూ.9,371.17 కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసినట్లు తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు జరిగిన నష్టంలో 80.45 శాతం విలువగల ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపింది.

Here's ED Tweet

విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసం చేసినట్లు గతంలో కేసులు నమోదయ్యాయి. వీరు తాము ఏర్పాటు చేసిన కంపెనీల ద్వారా నిదులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. వీరు చేసిన మోసాల కారణంగా బ్యాంకులకు రూ.22,585.83 కోట్లు నష్టం వాటిల్లింది. సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది.

టీడీపీ మాజీ ఎంపీ ఇంటిపై సీబీఐ దాడులు, రూ.7,926.01 కోట్లు మోసానికి పాల్పడిందని సీబీఐ అభియోగాలు నమోదు, రాయపాటి ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థపై సీబీఐకి ఫిర్యాదు చేసిన కెనరా బ్యాంకు

బ్యాంకులు ఇచ్చిన నిధులను తమ కంపెనీల ద్వారా వీరు రొటేషన్, దారి మళ్లింపులకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్‌లు పేర్కొంటున్నాయి. ఈ ముగ్గురినీ తిరిగి మన దేశానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు పూర్తి కాగానే ఈ ముగ్గురినీ మన దేశానికి రప్పించడానికి బ్రిటన్, ఆంటిగ్వా, బార్బుడాలకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా పరారైన ఆర్థిక నేరగాళ్ళు అని ముంబైలోని మనీలాండరింగ్ నిరోధక న్యాయస్థానం ప్రకటించింది.



సంబంధిత వార్తలు

Mumbai Boat Accident Update: ముంబై బోటు ప్రమాదం, గల్లంతైన వారి కోసం ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ఆసుపత్రిలో చేరిన 105 మందిలో 90 మంది డిశ్చార్జ్, ఇద్దరి పరిస్థితి విషమం

Jagan Slams Chandrababu Govt: పలావు పోయిందీ, బిర్యానీ పోయింది, చంద్రబాబు మీద మండిపడిన వైఎస్ జగన్, విజన్‌ 2047 పేరిట మరో డ్రామా జరుగుతుందని వెల్లడి

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Weather Forecast: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif