Vijay Mallya: మీ డబ్బులు పైసాతో సహా చెల్లిస్తా..నన్ను వదిలేయండి, యుకే కోర్టు బయట విజయ్ మాల్య, తనపై ఈడీ కక్ష గట్టిందంటూ ఆరోపణలు, మాకు ఆయన్ని అప్పగించమంటున్న ఈడీ
Vijay Mallya (Photo Credits: ANI)

London, Febuary 15: లండన్లో (London) తలదాచుకుంటున్న విజయ్ మాల్య (Vijay Mallya), భారత్‌లో ఎన్నో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారని ఈడీ అభియోగాలు మోపిన విషయం విదితమే. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్య ఎట్టకేలకు దిగి వచ్చాడు. బ్యాంకులకు ఇవ్వాల్సిన మొత్తం చెల్లిస్తానని ట్విట్టర్లో ఆయన ట్వీట్ చేశారు. బ్యాంకుల వద్ద తాను తీసుకున్న రుణాలన్నింటినీ తిరిగి చెల్లిస్తానని, తనను వదిలి పెట్టాలని భారత ప్రభుత్వాన్ని కోరాడు.

కమ్ముకున్న యుద్ధ మేఘాలు

దాదాపు రూ.9వేల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టిన మాల్యా.. సీబీఐపై తన అక్కసును వెళ్లగక్కాడు. నాలుగేళ్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), సీబీఐ తనతో అసంబద్ధంగా వ్యవహరిస్తున్నాయని పరారీలో ఉన్న మద్యం వ్యాపారి విజయ్‌ మాల్యా ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా క్షుద్ర కుట్ర చేస్తోందని ఆరోపించాడు.

3వ ప్రపంచ యుద్ధం ఆసన్నమైందా..?

భారత్‌లోని బ్యాంకుల నుంచి రూ. 9 వేల కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టారన్న ఆరోపణలకు సంబంధించి మాల్యాను భారత్‌కు అప్పగించడంపై గురువారం లండన్‌లోని హైకోర్టులో (Royal Courts of Justice in London) వాదనలు జరిగాయి. విమానయాన రంగం లో చోటు చేసుకున్న ప్రతికూల పరిణామాలకు తాను బలయ్యానని, అంతేతప్ప బ్యాంకు రుణాలు తీసుకోవడంలో దురుద్దేశాలేవీ లేవని మాల్యా కోర్టుకు తెలిపారు.

Here's Vijay Mallya tweet

కోర్టు వెలుపల ఆయన మాట్లాడుతూ.. ‘మీ డబ్బులు మీరు తీసుకోండి అని ఒకవైపు బ్యాంకులను కోరుతున్నా. అలా కుదరదు.. మాల్య ఆస్తులపై మాకు అధికారం ఉంది అని ఈడీ (Enforcement Directorate) చెప్తోంది. అంటే, ఒకే ఆస్తులకు సంబంధించి ఒకవైపు ఈడీ, మరోవైపు బ్యాంకులు పోరాడుతున్నాయి. నాలుగేళ్లుగా ఇదే తీరు’ అని మండిపడ్డారు. ‘చేతులు జోడించి బ్యాంకులను వేడుకుంటున్నా. మీరు ఇచ్చిన రుణం మొత్తం మీరు తీసుకోండి. నిజానికి కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ (Kingfisher Airlines) తరఫున తీసుకున్న రుణం అది. అయినా కూడా బాధ్యతగా భావించి చెల్లిస్తానంటున్నా’ అని అన్నారు.

మొదలైన యుద్ధం

ఇదిలా ఉండగా, భారత్‌కు తనను అప్పగించే విషయమై అప్పీల్ చేసుకునేందుకు బ్రిటన్ కోర్టు మాల్యాకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మాల్యాను విచారించేందుకు అవసరమైన అన్ని ఆధారాలున్నాయని భారత్‌ తరఫున క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ వాదించింది.

కాగా మాల్య లాంటి ‘అప్పగింత’ కేసుల్లో సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలుకు అనుమతి లభించడం అరుదైన విషయమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లోని యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లో అప్పీలు దాఖలు చేసుకోవడానికి దారులు ఏర్పడ్డాయి. అయితే అప్పగింత కేసుల్లో కోర్టు జోక్యం ఉండకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.