Excise Policy Case: లిక్కర్‌ కేసులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ సబబేనని తెలిపిన ధర్మాసనం

లిక్కర్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనను అరెస్టు చేయడం, అనంతరం ట్రయల్‌ కోర్టు కస్టడీకి ఇవ్వడం అక్రమమని కేజ్రీవాల్‌ దాఖలుచేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది

Arvind Kejriwal Arrested (photo-PTI)

New Delhi, April 09:  ఆమ్‌ఆద్మీపార్టీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో నిరాశే ఎదురైంది. లిక్కర్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనను అరెస్టు చేయడం, అనంతరం ట్రయల్‌ కోర్టు కస్టడీకి ఇవ్వడం అక్రమమని కేజ్రీవాల్‌ దాఖలుచేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసేందుకే ఈడీ తనను అరెస్టు చేసిందనే కేజ్రీవాల్‌ వాదనను కోర్టు తోసిపుచ్చింది.తీర్పులో భాగంగా లిక్కర్‌ కేసులో కేజ్రీవాల్‌ పాత్రపై ఢిల్లీ హైకోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కవితకు కోర్టులో దక్కని ఊరట, జ్యూడీషియల్‌ రిమాండ్‌ ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు

లిక్కర్‌ స్కామ్‌కు పాల్పడటం ద్వారా అక్రమ సొమ్ము సంపాదనకు కేజ్రీవాల్ కుట్రపన్నారనేందుకు తగిన ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. ఈ కారణం‍తో లిక్కర్‌ కేసు దర్యాప్తులో భాగంగా కేజ్రీవాల్‌ అరెస్టు సబబేనని హైకోర్టు అభిప్రాయపడింది. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. అనంతరం వారం రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న తర్వాత కోర్టు కేజ్రీవాల్‌కు ఏప్రిల్‌ 15 దాకా జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్‌ కీలక నేత మనీష్‌ సిసోడియా ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే.