ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ 14 రోజుల కస్టడీ ఈరోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను ఈడీ అధికారులు ఢిల్లోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశ పెట్టారు. కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు.ఈ నేపథ్యంలో ఏప్రిల్ 23వ తేదీ వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, తీహార్‌ జైల్లో కవితను విచారించనున్న సీబీఐ, ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు

ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ. 100 కోట్లు చెల్లించినట్టు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. తొలుత ఈడీ కస్టడీలో ఉన్న కవితకు... ఆ తర్వాత కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో, మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. కవితకు రిమాండ్ పొడిగించే అవకాశాలు ఉన్నాయి.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)