Exit Poll Results: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముగిసిన పోలింగ్, రెండు చోట్ల అధికారం బీజేపీదేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి
రెండు రాష్ట్రాల్లో బీజేపీకే అత్యధిక సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా ఉన్నాయి...
Mumbai/Chandigarh, October 21 : మహారాష్ట్ర (Maharashtra), హరియాణ (Haryna) అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Election 2019) పోలింగ్ ముగిసింది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు, హరియాణలోని 90 అసెంబ్లీ స్థానాలకు అలాగే దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలలో 51 అసెంబ్లీ స్థానాలకు మరియు 2 లోకసభ స్థానాలకు ఎన్నికల సంఘం ఈరోజు పోలింగ్ నిర్వహించింది. వీటి ఫలితాలు అక్టోబర్ 24న విడుదల కానున్నాయి.
సాయంత్రం 5 గంటల వరకు మహారాష్ట్రలో 44 శాతం ఓటింగ్ నమోదు కాగా, హరియాణలో 52 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు చోట్ల భారీ వర్షాలు, ఈవీఎంల మొరాయింపు కారణంగా ఓటింగ్ అత్యల్పంగా నమోదైనట్లు తెలుస్తుంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో సాయంత్రం 5 గంటల వరకు 44 శాతం వరకే ఓటింగ్ నమోదైంది. సినీ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపిక పదుకోన్, అనుష్క శర్మ మరియు అమితాబ్ కుటుంబ సభ్యులు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా, పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లో బీజేపీకే అత్యధిక సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా ఉన్నాయి
ఇండియా టుడే - మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీ 109-124 సీట్ల మధ్య గెలుస్తుందని, దాని మిత్రపక్షం శివసేన 57-70 సీట్ల మధ్య గెలుస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకి సీట్లు 72-90 వరకు రావొచ్చు, మరియు దాని మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 40-50 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఇతరులకు 22-32 సీట్లకే పరిమితమవుతాయని ఈ సంస్థ వెల్లడించింది. సీ-ఓటర్ సర్వే ఓపీనియన్ పోల్ ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
మరో సంస్థ రిపబ్లిక్-జాన్ కి బాత్, బీజేపికి 135-142 సీట్లు, మిత్రపక్షం శివసేన 81-88 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది.
మహారాష్ట్రలో మొత్తంగా బీజేపీ- శివసేన కూటమికి 180 నుంచి 204 స్థానాలు గెలుచుకుంటాయని, కాంగ్రెస్ కూటమి 44 నుంచి 57 స్థానాలు, ఇతరులు 10 స్థానాల వరకే గెలుచుకుంటాయని పేర్కొన్నాయి.
హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా ఉన్నాయి
ABP సంస్థ నిర్వహించిన సర్వేలో హరియాణలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయనున్నట్లు ఫలితాలను వెల్లడించింది. 90 స్థానాలకు గానూ బీజేపీకి 72 సీట్లు దక్కే అవకాశం ఉందని పేర్కొంది, కాంగ్రెస్ కేవలం 8 స్థానాలకే పరిమితం అవుతుండగా. ఇతర పార్టీలకు 10 సీట్లు రావొచ్చని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల ట్రెండ్‌ను ఫాలో అయిన మహారాష్ట్ర రాజకీయ పక్షాలు
ఇక టీవీ 9 భరత్వర్ష్ ఎగ్జిట్ పోల్ ప్రకారం హరియాణలో బీజేపికి 69 సీట్లతో స్పష్టమైన మెజారిటీ దక్కించుకుంటుందని అంచనా వేసింది, కాంగ్రెస్‌కు 11, ఇతరులకు 9 సీట్లు వస్తాయని పేర్కొంది.
చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తున్నట్లు, కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఏమాత్రం లేనట్లు వెల్లడించాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. గత డిసెంబర్ లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విఫలమవుతుందని, మహాకూటమి గెలుస్తుందని అంచనా వేశాయి. ఏపిలో కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తున్నప్పటికీ తెలుగు దేశం పార్టీకి అధిక సీట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రాలో వైసీపీ ఫలితాల్లో క్లీన్ స్వీప్ చేశాయి, ఫలితంగా ప్రతిపక్ష పార్టీలు గల్లంతయ్యాయి. మరి మహారాష్ట్ర, హరియాణలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? తారుమారు అవుతాయా అనేది అక్టోబర్ 24న తేలనుంది.