Fake Diwali Sale Offers: దీపావళికి షాపింగ్ చేస్తున్నారా? ఫేక్ అమెజాన్, ఫ్లిప్ కార్డ్ సేల్స్‌ తో జరభద్రం, దీపావళి షాపింగ్ చేసే వాళ్లే టార్గెట్‌గా సైబర్ క్రిమినల్స్ మోసాలు

ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌ల పేరుతో దీపావళి స్కామర్లు కొనుగోలుదారులను మోసగిస్తున్నారు. క్లౌడ్ఎస్ఈకే బృందం రీఛార్జ్, ఇ-కామర్స్ సెక్టార్లలో గందరగోళానికి గురిచేస్తున్న ఫిషింగ్ క్యాంపెయిన్ గ్రూపును కనుగొంది.

Beware of fake OTP delivery scam Representational Image (Photo Credit: PTI)

New Delhi, NOV 10: అసలే పండుగ సీజన్.. అందులోనూ దీపావళి ఆఫర్లు (Diwali Offers), మరెన్నో డిస్కౌంట్లతో ఆన్‌లైన్‌లో వినియోగదారులను తెగ ఊరిస్తుంటాయి. స్మార్ట్‌ఫోన్ల నుంచి అనేక ఎలక్ట్రానిక్స్ డివైజ్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్లను చూడగానే టెంప్ట్ అయిపోతుంటారు. ఆఫర్ ముగిసేలోగా వెంటనే కొనేసుకోవాలని ఆరాటపడుతుంటారు. అయితే, ఇలాంటి వారినే సైబర్ మోసగాళ్లు (Cyber Criminals) టార్గెట్ చేస్తుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆన్‌లైన్ స్కామ్‌లతో దీపావళి షాపింగ్ చేసే కస్టమర్లను నమ్మించి నగదు దోచుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే.. అందరికి ముందుగా గుర్తొచ్చేవి ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వెబ్ సైట్లు.. ఈ సైట్ల నుంచి నచ్చిన వాటిని కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో అమాయకులు చిక్కుకుంటున్నారు. పండుగ సీజన్ సమయంలో స్కామర్లు ఫేక్ వెబ్‌సైట్లను అధికారిక వెబ్‌సైట్ల మాదిరిగా ఆఫర్లను గుప్పిస్తుంటారు. అది నమ్మి ఆయా వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేసి వినియోగదారులు మోసపోతున్నారు. ఈ ఆన్‌లైన్ స్కామ్‌లపై క్లౌడ్ఎస్ఈకే (CloudSEK)కి చెందిన సైబర్ పరిశోధకులు షాపింగ్ చేసే యూజర్లను (Targeting Diwali Sale) హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌ల పేరుతో దీపావళి స్కామర్లు కొనుగోలుదారులను మోసగిస్తున్నారు. క్లౌడ్ఎస్ఈకే బృందం రీఛార్జ్, ఇ-కామర్స్ సెక్టార్లలో గందరగోళానికి గురిచేస్తున్న ఫిషింగ్ క్యాంపెయిన్ గ్రూపును కనుగొంది. ఈ స్కామర్లు పండుగ సీజన్‌లో క్రిప్టో రీడైరెక్ట్‌లు, బెట్టింగ్ స్కీమ్‌ల వంటి వ్యూహాలను ఉపయోగించి పెద్ద బ్రాండ్‌ల పేర్లతో మోసాలకు పాల్పడుతున్నారు.

Uttar Pradesh Shocker: యూపీలో దారుణం, శృంగారానికి ఒప్పుకోలేదని బాలుడిని దారుణంగా చంపిన మరో యువకుడు, చెరకు తోటలో మృతదేహం

గత వారంలో క్లౌడ్‌సెక్‌లో స్క్వాడ్ ఫేస్‌బుక్ యాడ్స్ లైబ్రరీ నుంచి 828 డాడ్జీ డొమైన్‌లను వెలికితీసింది. ఈ డొమైన్‌లు ఫిషింగ్‌కు సంబంధించినవిగా గుర్తించింది. వారి సమాచారాన్ని బహిర్గతం చేయడానికి యూజర్లనుమోసగించడానికి ప్రయత్నిస్తున్నాయని తేలింది. క్లౌడ్‌సెక్‌లో సైబర్ ఇంటెలిజెన్స్ హెడ్ హోంచో రిషికా దేశాయ్ ప్రకారం.. ఈ ఏడాదిలో ఫేక్ షాపింగ్ వెబ్‌సైట్లు స్కామ్‌లు బయపడ్డాయని అన్నారు.

Delhi Odd Even Scheme: కాలుష్యం కోరల నుంచి ఢిల్లీ వాసులకు ఊరట, పలు ప్రాంతాల్లో వర్షంతో గాలి నాణ్యత సూచీలో మెరుగు, సరిబేసి విధానం వాయిదా వేసిన ప్రభుత్వం

కొనుగోలుదారులను మోసం చేయడానికి హ్యాకర్లు కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్లుగా నమ్మించి మోసగించే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. ఈ ట్రిక్స్‌ని ముందుగానే గుర్తించడం వల్ల దీపావళి సీజన్‌లో మోసాల బారిన పడకుండా చాలా మందిని రక్షించవచ్చు. సైబర్ నేరగాళ్లు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇప్పుడు, ఈ స్కామర్లు ఉపయోగించే ట్రిక్స్ ద్వారా ప్రతి ఒక్కరూ దీపావళి షాపింగ్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

ఫేక్ సైట్‌లను క్రియేట్ చేసి టైపోస్క్వాటింగ్ వంటివి ఉపయోగించారు. ఉదాహరణకు, వారు ‘shop.com’ లేదా ‘shoop.xyz’గా పేరు మార్పుతో సైట్ లుక్, అదే కంటెంట్‌తో వినియోగదారులను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు. క్లౌడ్‌సెక్ బృందం ఈ ఫేక్ సైట్‌లను గుర్తించి చర్యలు తీసుకుంది. ఈ స్కామీ సైట్‌లలో చాలా వరకు అడ్మిన్ ప్యానెల్ ఉంది. సైట్‌లు డిలీట్ చేసినప్పటికీ కూడా బ్యాకెండ్‌లో ఫిషింగ్ డేటా అలానే ఉండిపోయిందని సూచించింది.

అంతే కాదు.. బెట్టింగ్ గేమ్ కూడా జరుగుతోందని హెచ్చరించింది. ‘దీపావళి’, ‘పూజా’ వంటి కీలక పదాలతో కూడిన వెబ్‌సైట్‌లు హాంకాంగ్‌లో హోస్టింగ్ చేస్తున్నాయని, చైనీస్ బెట్టింగ్ పేజీలకు రీడైరెక్ట్ అవుతున్నాయని గుర్తించింది. సైబర్ నేరగాళ్లు దీపావళి సందర్భంగా ఫేక్ సైట్‌లతో వినియోగదారులను ఆకర్షించడానికి ఇది సరైన సమయం. క్రిప్టోకరెన్సీ స్కామ్‌లతో పాటు సోషల్ మీడియాలో దీపావళి ఫ్రీబీల స్కెచ్ క్రిప్టో వెబ్‌సైట్‌లలో రిజిస్టర్ చేసుకోవడం వంటి మోసాలకు పాల్పడుతున్నారు.

క్రిప్టో ప్లాట్‌ఫారమ్‌లకు సైన్ అప్ చేసేందుకు వినియోగదారులకు ఉచిత జీవిత బీమా, ప్రత్యేక నాణేలు వంటి ఆకర్షణీయమైన ఆఫర్‌ను ఎలా అందించాలో ఈ స్కామర్‌లకు తెలుసునని రిషికా దేశాయ్ హెచ్చరించారు. ఇలాంటి సందేహాస్పదమైన క్రిప్టో ప్లాట్‌ఫారమ్‌లకు భారీగా రిజిస్ట్రేషన్‌లను పొందడానికి వినియోగదారులు దీపావళి ఫ్రీబీలను ఉపయోగించుకునే అనేక సందర్భాలు ఆన్‌లైన్‌లో గుర్తించినట్టు తెలిపారు.