Delhi Air Pollution (Photo Credit: ANI)

New Delhi, Nov 10: దేశ రాజధాని ఢిల్లీలో స‌రి-బేసి విధానం(Odd-Even Policy) అమ‌లును వాయిదా వేస్తున్న‌ట్లు ఆ రాష్ట్ర ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. కాలుష్యం స్థాయి త‌గ్గ‌డంతో.. ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇటీవ‌ల 450 ప‌స్ల్ ఉండేద‌ని, కానీ ఇప్పుడు ఆ ఎయిర్ క్వాలిటీ 300కు చేరుకుంద‌ని, దీని వ‌ల్లే స‌రి-బేసి విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. అయితే దీపావ‌ళి త‌ర్వాత మ‌ళ్లీ స‌రి-బేసి విధానంపై స‌మీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.కాగా న‌వంబ‌ర్ 13 నుంచి 20 వ‌ర‌కు స‌రి-బేసి విధానంలో వాహ‌నాల‌కు అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌భుత్వం వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అయితే

ఢిల్లీని(Delhi) పట్టి పీడిస్తున్న వాయు కాలుష్యంపై(Air Pollution) దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా నేడు సుప్రీం కోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కాలుష్య కట్టడిపై కేజ్రీవాల్ సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలుష్యానికి ప్రధాన కారణం పంట వ్యర్థాలు తగలబెట్టడమేనా అన్న అంశంపై విచారిస్తుండగా.. పొరుగు రాష్ట్రాల్లో వరిగడ్డిని కాల్చడాన్ని (Stubble Burning) కట్టడి చేయడంలోనూ ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకుంటేనే ప్రభుత్వంలో చలనం వస్తుందా అని ప్రశ్నించింది. ఏటా ఇదే సమస్య ఉత్పన్నమవుతోందని పేర్కొంది. వాయు కాలుష్యంలో 24% గడ్డి కాల్చడం వల్లే ఉత్పన్నం అవుతోందని వెల్లడించింది.

హిందూ మత రక్షణ కోసం మార్గదర్శకాలు రూపొందించాలనే పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు, విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో వాయు కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడమే కారణమా? అన్నదానిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా.. దీనిపై అమికస్‌గా ఉన్న అపరాజితా సింగ్ న్యాయస్థానానికి ఓ నివేదిక సమర్పించారు. కాలుష్య మూలాలపై అందులో కీలక వివరాలను పేర్కొన్నారు. మొత్తం కాలుష్యంలో పంటవ్యర్థాల దగ్ధం 24 శాతం మేర ప్రభావం చూపుతోందని తెలిపారు. బొగ్గు మండించడం వల్ల 17 శాతం, వాహనాల నుంచి వెలువడే పొగ 16 శాతం గాలి కాలుష్యానికి కారణమని చెప్పారు.

ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ప్రతి సంవత్సరం ఢిల్లీని కాలుష్య సమస్య వెంటాడుతూ ఉంది. మేం జోక్యం చేసుకుంటే కానీ ప్రభుత్వంలో చలనం రావట్లేదు. పంజాబ్, హరియాణాల్లో గడ్డి కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతోంది. గడ్డి కాల్చడం వల్ల 24 శాతం గాలి కలుషితం అవుతోంది. బొగ్గు, బుడిద వల్ల 17 శాతం, వాహనాల వల్ల 16 శాతం గాలి కలుషితమవుతోంది. ఇదంతా ఢిల్లీ ప్రభుత్వానికి తెలుసు. అయినా సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే వరకు స్పందన కరవయింది. వాహనాల్లో సరి - బేసి విధానం అమలు చేయాలా వద్దా అన్నది మాపై వదిలేయకండని తెలిపింది.

ఢిల్లీలో అన్ని స్కూళ్లకు నవంబర్‌ 9 నుంచి 18వ తేదీ వరకూ శీతాకాల సెలవులు, కాలుష్యం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కేజ్రీవాల్ సర్కారు

వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసులకు తాజాగా స్వల్ప ఊరట కలిగింది. ఢిల్లీతో సహ నోయిడా, గురుగ్రామ్‌, ఎన్సీఆర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి ఓ మోస్తారు వాన పడింది. ఇది రాజధానానిలో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పుకు దారితీసింది. గాలిలో ఉన్న విష‌పూరిత వాయులు కొంత వ‌ర‌కు క్లీన్ అయ్యాయి. గాలి నాణ్యత సూచి కూడా స్పల్పంగా మెరుగుపడింది.

శుక్రవారం ఉదయంనాటికి ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచీ (AQI) 408కి తగ్గింది. నిన్న సాయంత్రం ఇది 437గా నమోదైంది. శుక్రవారం కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించడంతో ఢీల్లి కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కర్తవ్య పాత్‌, ఐటీఓ, ఢిల్లీ-నోయిడా సరిహద్దు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా పడిన వర్షపు జల్లులకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఢిల్లీ వ్యాప్యంగా చాలా చోట్ల గురువారం రాత్రి వరకు 400+ ఉన్న గాలి నాణ్యత సూచీ ఆ తరువాత 100 కంటే తక్కువ నమోదైంది. పశ్చిమ గాలులు దిశ మార్చుకోవడంతో వాయువ్య భారతంలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి