Fake Traffic Cop: వీడు మామూలోడు కాదు! నిజం పోలీసులతో చలాన్లు వసూలు చేయించిన ఫేక్ ట్రాఫిక్ పోలీసు, స్పెషల్ డ్యూటీ అంటూ నిజం పోలీసులపై అజమాయిషీ చేసిన దొంగ, దొరికినకాడికి చలాన్లు వసూలు చేసిన నకిలీ

కానీ అస్సాంలో ఓ ఘరానా దొంగ మాత్రం ఏకంగా పోలీసు వేషం వేశాడు. అంతటితో ఆగకుండా...నిజమైన పోలీసులతో ట్రాఫిక్ చలాన్లు (Traffic challans) వసూలు చేయించాడు. వారికి ఆర్డర్లు వేస్తూ అజమాయిషీ చలాయించాడు. దాంతో అనుమానం వచ్చిన పోలీసులు...ఆరా తీయడంతో అసలు రంగు బయటపడింది.

New RTI Act, Road Safety- representational image.

Guwahati, AUG 07: మోసం చేసేందుకు రోజుకో వేషం వేసేవారిని చాలామందిని చూసి ఉంటాం. కానీ అస్సాంలో ఓ ఘరానా దొంగ మాత్రం ఏకంగా పోలీసు వేషం వేశాడు. అంతటితో ఆగకుండా...నిజమైన పోలీసులతో ట్రాఫిక్ చలాన్లు (Traffic challans) వసూలు చేయించాడు. వారికి ఆర్డర్లు వేస్తూ అజమాయిషీ చలాయించాడు. దాంతో అనుమానం వచ్చిన పోలీసులు...ఆరా తీయడంతో అసలు రంగు బయటపడింది. అస్సాంలోని సానిట్‌పూర్ జిల్లాలో (Sonitpur district)రోజూ ట్రాఫిక్ పోలీసులాగే డ్రెస్ చేసుకుని, ఒరిజినల్ పోలీసులతో కలిసి డ్యూటీ చేస్తుండేవాడు. వాహనదారుల నుంచి వీలైనంత వసూలు చేసేవాడు. జీతం ఎలాగో రాదు.. చలాన్ల  (Challans) పేరుతో చేసే వసూళ్లే కాబట్టి, దొరికినవారితో దొరికినంత దోచుకునే వాడు. కానీ, చివరకు పోలీసులకు దొరికిపోయాడు. అతడి నకిలీ బాగోతం బయటపడింది.

Missing Poster Reunited: కిడ్నాపైన 9 ఏళ్లకు ఇంటికి చేరిన బాలిక, పక్క వీధిలోనే ఉన్నప్పటికీ ఇంటికి చేరేందుకు సుధీర్ఘ సమయం, ఫేస్‌బుక్‌ పోస్టుతో కుటుంబం దగ్గరకు చేరిన పూజ కథ ఇదీ! 

అసోంలోని సానిట్‌పూర్ జిల్లాలో (Sonitpur district) ఒక వ్యక్తి ట్రాఫిక్ ఆఫీసర్‌లా డ్రెస్ చేసుకుని, ఒరిజినల్ పోలీసులతో కలిసిపోయి డ్యూటీ చేసేవాడు. నిజమైన పోలీసులు.. అతడు వేరే బ్రాంచ్ నుంచి వచ్చుంటారేమో అనుకుని పని చేసేవారు. గుహవటి (Guwahati) నుంచి వచ్చిన అతడు వేరే పోలీసుల్ని పిలిచి వాహనాలు తనిఖీ చేయమని చెప్పేవాడు. ప్రతి వాహనాన్ని ఆపి, ఫైన్లు వసూలు చేసేవాడు. అయితే, అతడి ప్రవర్తన అనుమానాస్పదంగం ఉండటంతో నిజమైన ట్రాఫిక్ పోలీసులు, ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. తర్వాత పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

UP Minister Flees From Court: దోషిగా ప్రకటించి శిక్ష ఖరారు చేసేలోపే కోర్టు నుంచి పరారైన మంత్రి, అక్రమాయుధాల కేసులో దోషిగా తేలిన ఉత్తరప్రదేశ్‌ మంత్రి, సీసీటీవీ ఫుటేజ్‌లో చిక్కిన అమాత్యుడు 

అతడు ట్రాఫిక్ పోలీసే కాదని.. డబ్బుల కోసం ఇలా మోసం చేస్తూ, వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా అనేక ప్రాంతాల్లో ఇలాగే ట్రాఫిక్ పోలీసు వేషంలో మోసాలకు పాల్పడ్డట్లు చెప్పాడు. తాను ట్రాఫిక్ పోలీసు అవ్వాలనుకున్నానని, అయితే సరైన చదువు లేకపోవడం వల్ల కుదరలేదని, అందుకే ఇలా చేస్తున్నానని అతడు చెప్పాడు. ప్రస్తుతం పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు