Missing Poster Reunited: కిడ్నాపైన 9 ఏళ్లకు ఇంటికి చేరిన బాలిక, పక్క వీధిలోనే ఉన్నప్పటికీ ఇంటికి చేరేందుకు సుధీర్ఘ సమయం, ఫేస్‌బుక్‌ పోస్టుతో కుటుంబం దగ్గరకు చేరిన పూజ కథ ఇదీ!

Mumbai, AUG 07: ఒక్కోసారి చిన్న చిన్న క్లూతో పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది. అలాంటి ఘటనే ముంబైలో జరిగింది. ఫేస్‌బుక్‌లో పెట్టిన పాతపోస్టుతో 9 ఏళ్ల తర్వాత ఓ చిన్నారి సొంతింటికి వెళ్లేందుకు సాయపడింది. ముంబైలో స్కూలుకి అని వెళ్లిన పిల్ల.. ఇంకా ఇంటికి రాలేదు. పోలీసులకు ఫిర్యాదు (Police complaint) చేసినా లాభం లేదు. తెలిసినవారిని, తెలియని వారిని అడిగినా ఆచూకీ దొరకలేదు. ఏడ్చి ఏడ్చి ఆ కుటుంబం ఆ విషయమే మర్చిపోయింది. ఇది గడిచిన తొమ్మిదేళ్లకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ‘‘నేను పూజని అమ్మా’’ అంటూ. అంతే ఆ తల్లి మరోసారి కన్నీళ్లతో నిండిపోయింది. తొమ్మిదేళ్ల క్రితం కిడ్నాప్‭కు గురై మిస్సింగ్ పోస్టర్ (Missing poster) ద్వారా కుటుంబాన్ని చేరుకున్న 16 ఏళ్ల పూజ (Pooja) అనే అమ్మాయి స్టోరీ ఇది.  అప్పుడు పూజ వయసు 7 ఏళ్లు. ముంబైలోని అంధేరీలో కుటుంబంతో సహా ఉంటున్న పూజ 2013 జనవరి 22 తన సోదరుడితో కలిసి స్కూలుకు వెళ్లింది. దారిలో హెన్రీ డీసౌజ అనే వ్యక్తి ఐస్ క్రీం ఇచ్చి పూజను కిడ్నాప్ చేశాడు. ఇంతకీ అతడు కిడ్నాప్ చేసింది ఏ హ్యూమన్ ట్రాఫికింగ్‭కో కాదు. తనకు పిల్లలు లేకపోవడంతో పూజను కిడ్నాప్ చేసి పెంచుకున్నారు. ఇందులో హెన్రీ భార్య ప్రమేయం కూడా ఉంది. అనంతరం పూజ పేరును అన్నీ డీసౌజగా మార్చి కర్ణాకటలోని ఒక హాస్టల్ ఉంచుతూ చదివించారు.

Ketki dave: భర్త చనిపోయిన రెండు రోజులకే.. వర్క్ లోకి నటి.. వృత్తిపట్ల నిబద్ధతకు ఇది తార్కాణం అంటూ నెటిజన్ల ప్రశంసలు..  

కొంత కాలానికి హెన్రీ దంపతులకు ఒక బిడ్డ పుట్టడంతో పూజను పట్టించుకోవడం మానేశారు. పూజ చేత పనులు చేయించుకోవడం, ఆమెను సరిగా చూడకపోవడం చేశారు. పూజకు ఈ పరిణామంతో వాళ్లు తన అసలు తల్లిదండ్రులు కాదనే విషయం తెలిసింది. దీంతో తన గతానికి సంబంధించిన జ్ణాపకాలను తోడడం ప్రారంభిస్తే ఎక్కడో మసకమసకగా తన కుటుంబం గుర్తొస్తుంది. నిజానికి తన వాళ్ల వివరాలేవీ పూజకు గుర్తు లేదు. అయితే స్నేహితురాలితో విషయం చెప్పే సరికి ‘‘పూజ మిస్సింగ్’’ అని గూగుల్ చేశారు. ఎప్పుడో 2013కు సంబంధించిన ఒక మిస్సింగ్ పోస్టర్ వారికి దొరికింది. ఐదు నంబర్లు ఉండగా అందులో నాలుగు నంబర్లు ఇప్పుడు పని చేయడం లేదు. లక్కీగా ఒక నంబర్ కలిసింది. అది పూజా ఇంటి పక్కన ఉండే రఫీక్‭ది. వెంటనే రఫీక్‭కు కాల్ చేసి తన తల్లి కోసం ఆరా తీసింది పూజ.  ఆమె తల్లికి వీడియో కాల్ కలిపాడు రఫీక్. ఆ తల్లి పూజను వెంటనే గుర్తి పట్టి బోరున ఏడ్చింది. అలా ఇద్దరూ కన్నీటిపర్యంతం అయ్యారు. పైగా పూజ ఉండే ఇంటికి తన తల్లిదండ్రులు ఉంటే ఇంటికి కొన్ని వందల మీటర్ల దూరమే కావడం గమనార్హం.

UP Minister Flees From Court: దోషిగా ప్రకటించి శిక్ష ఖరారు చేసేలోపే కోర్టు నుంచి పరారైన మంత్రి, అక్రమాయుధాల కేసులో దోషిగా తేలిన ఉత్తరప్రదేశ్‌ మంత్రి, సీసీటీవీ ఫుటేజ్‌లో చిక్కిన అమాత్యుడు 

వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అడ్రస్ కనిపెట్టి పూజను ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కుటుంబానికి దూరమైన ఈ సుదీర్ఘ సమయంలోనే తన తండ్రి చనిపోయాడనే విషయం తెలిసింది. కుటుంబం వద్దకు చేరానన్న ఆనందం ఒకవైపు, తండ్రి లేడన్న దు:ఖం మరొకవైపు. తల్లిని, సోదరుడిని పట్టుకుని గట్టిగా ఏడ్చింది. తన కిడ్నాప్‭ నుంచి ఇప్పటి వరకు జరిగినదంతా కుటుంబ సభ్యులు, పోలీసులతో పంచుకుంది. పోలీసులు హెన్రీ దంపతులను అరెస్ట్ చేసి కిడ్నాపింగ్, బాలనేరస్తుల నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. ఇప్పుడు పూజ వయసు 16 ఏళ్లు. తెలిసీతెలియని వయసులో కుటుంబానికి దూరమైన పూజకు.. కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఉన్న కుటుంబాన్ని చేరడానికి 9 ఏళ్లు పట్టింది.