YSRCP Supports New Farm Bills: వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు, రైతులు ముందుగానే ధర నిర్ణయించుకునే అవకాశం, మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుందని తెలిపిన వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి

కొత్తగా వచ్చిన బిల్లులతో రైతులకు స్వేచ్ఛ లభించి, దళారీ వ్యవస్థకు ముగింపు లభిస్తుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సభలో జరిగిన వ్యవసాయ బిల్లులపై చర్చలో విజయసాయి రెడ్డి (YCP MP Vijaya Sai Reddy) మాట్లాడుతూ.. పంటలకు ముందుగానే ధర నిర్ణయం వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందన్నారు. దళారీల ఆగడాల నుంచి రైతులకు విముక్తి కలుగుతుందని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుంది.

Image used for representational purpose. | Photo Wikimedia Commons

New Delhi, Sep 20: రాజ్యసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు(YSRCP Supports New Farm Bills) ఇచ్చింది. కొత్తగా వచ్చిన బిల్లులతో రైతులకు స్వేచ్ఛ లభించి, దళారీ వ్యవస్థకు ముగింపు లభిస్తుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సభలో జరిగిన వ్యవసాయ బిల్లులపై చర్చలో విజయసాయి రెడ్డి (YCP MP Vijaya Sai Reddy) మాట్లాడుతూ.. పంటలకు ముందుగానే ధర నిర్ణయం వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందన్నారు. దళారీల ఆగడాల నుంచి రైతులకు విముక్తి కలుగుతుందని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుంది.

బిల్లులో పొగాకును ఎందుకు చేర్చడం లేదు. రైతు ప్రయోజనాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్ (YSRCP) అండగా ఉంటుంది. రైతు భరోసా పేరుతో 49 లక్షల మంది రైతులకు ఏటా 13,500 ఇస్తోంది. రైతు భరోసా కేంద్రాలతో విత్తనాలు, ఎరువులు తదితర అన్ని అంశాల్లో సహాయకారిగా ఉంటుందని వివరించారు.

విపక్షాల నిరసలన మధ్యే వ్యవసాయ బిల్లులు రాజ్యసభ ముందుకు వచ్చాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఆదివారం ఉదయం రెండు వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ బిల్లులు చారిత్రాత్మకమని, రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు పునాది పడతాయని ఆయన పేర్కొన్నారు. ఎంఎస్‌పీతో ఈ బిల్లులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని తోమర్‌ తెలిపారు.

కోర్టుకు వచ్చే ముందు ప్రభుత్వానికి వినతి పత్రం తప్పనిసరి, సంబంధిత అధికారులను ఆశ్రయించకుండా డిమాండ్‌ ఆఫ్‌ జస్టిస్‌ కోసం వేసే పిటిషన్లను విచారించబోమని తెలిపిన ఏపీ హైకోర్టు

అయితే వ్యవసాయ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ డిమాండ్‌ చేస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలిగించే విధంగా, రైతుల ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా ఉందని విమర్శించింది. కాగా వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులను రాజ్యసభలో ఆమోదం పొందించేందుకు మోదీ సర్కార్‌ పట్టుదలతో ఉంది. రైతులకు నష్టం కలిగించేలా బిల్లులు ఉన్నాయంటూ విపక్షాలతో పాటు స్వపక్షంలోనూ అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.

అయినా నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్ప‌టికే ఆ బిల్లుల‌కు లోక్‌స‌భలో ఆమోదం లభించింది. కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులకు వ్యతిరేకంగా బీజేపీ చిరకాల భాగస్వామి అయిన శిరోమణి అకాలీదళ్ఎంపీ హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif