Farmers Reject Govt Proposal: రిలయన్స్,అదానీ ఉత్పత్తులు బాయ్ కాట్, కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందే, కేంద్రం ప్రతిపాదనలను తిరస్కరించిన రైతు సంఘాలు, 12న హైవేల దిగ్బంధం.. 14న బీజేపీ కార్యాలయాల ముట్టడి
రైతులు ఆందోళన విరమించేందుకు ఒప్పుకుంటే తాము ప్రస్తుత వ్యవసాయ చట్టాల్లో కొన్ని సవరణలు చేస్తామంటూ మొత్తం 8 సవరణలతో కూడిన ప్రతిపాదనను పంపించింది. అయితే, ఈ ప్రతిపాదనలపై చర్చించేందుకు సమావేశమైన రైతు సంఘాల నాయకులు వాటిని ఏకగ్రీవంగా (Farmers Reject Govt Proposal) తిరస్కరించారు.
New Delhi, December 9: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు (Farm Reform Laws) వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనను విరమింపజేసేందుకు కేంద్రం తాజాగా ప్రతిపాదనలు పంపింది. రైతులు ఆందోళన విరమించేందుకు ఒప్పుకుంటే తాము ప్రస్తుత వ్యవసాయ చట్టాల్లో కొన్ని సవరణలు చేస్తామంటూ మొత్తం 8 సవరణలతో కూడిన ప్రతిపాదనను పంపించింది. అయితే, ఈ ప్రతిపాదనలపై చర్చించేందుకు సమావేశమైన రైతు సంఘాల నాయకులు వాటిని ఏకగ్రీవంగా (Farmers Reject Govt Proposal) తిరస్కరించారు.
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం తప్ప తాము మరే ప్రతిపాదనకు ఒప్పుకోమని తేల్చిచెప్పారు. తమ ఆందోళనలో భాగంగా సోమవారం ఢిల్లీలో భారీ ప్రదర్శన (Farmers Protest) నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపినప్పటికీ.. రైతులు మాత్రం చట్టాల రద్దు విషయం తప్ప ప్రభుత్వం ఏ ప్రతిపాదనతో వచ్చినా అంగీకరించేది లేదని తెగేసి చెబుతున్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నారు. వ్యవసాయ చట్టాల్లో 8 సవరణలు చేస్తామంటూ కేంద్ర సర్కారు పంపిన ప్రతిపాదనలను తిరస్కరించిన అనంతరం.. రైతులు సంఘాల నేతలు ఆందోళనను మరింత ఉధృతం చేసే విషయమై చర్చించారు. ఇందులో భాగంగా ఈ నెల 12న (శనివారం) ఢిల్లీ-జైపూర్, ఢిల్లీ-ఆగ్రా రహదారులను దిగ్బందించాలని రైతులకు రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ నెల 14న (సోమవారం) దేశంలోని అన్ని బీజేపీ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు వెల్లడించారు. రహదారుల దిగ్బంధనం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు ఢిల్లీకి తరలిరావాలని రైతు సంఘాల నేతలు కోరారు.
కాగా కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతుల ముందు కేంద్రం ప్రతిపాదనలు పెట్టింది. కనీస మద్దతు ధరను కల్పించేందుకు హామీ ఇస్తున్నట్లు లేఖ రాసింది. కావాలంటే లిఖితపూర్వంగా కూడా తాము హామీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా కేంద్రం వెల్లడించింది. కానీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తేనే ఆందోళనలను విరమిస్తామని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. కేంద్ర ప్రతిపాదనకు నో చెప్పేశారు.
Here's Tweet
దీంతో పాటుగా రిలయన్స్, అదానీ ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలని (Call For Boycott of All Adani and Reliance Products) రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రిలయన్స్ జియో సిమ్ లు వాడకూడదని వాటిని వెంటనే బాయ్ కాట్ చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. అన్ని జియో / రిలయన్స్ / అదానీ ఉత్పత్తులను బహిష్కరించాలి- దుకాణాల నుండి టోల్ ప్లాజా నుండి మొబైల్ సిమ్స్ వరకు అన్నింటిని బాయ్ కాట్ చేయాలని రైతు సంఘాలు దేశ ప్రజలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే ‘ సర్కార్ కి అస్లీ మజ్బూరి - అదానీ, అంబానీ, జమాఖోరి' అంటూ కొత్త నినాదాన్ని రైతులు ఎత్తుకున్నారు.