States Share: రాష్ట్రాల పన్నుల వాటాను విడుదల చేసిన కేంద్రం. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 1,892 కోట్లు మరియు తెలంగాణకు రూ. 982 కోట్లు మంజూరు
దేశంలో COVID-19 మహమ్మారి కారణంగా ఉత్పన్నమవుతున్న విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్రాలకు సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో ఎలాంటి కోతలు లేకుండా అందజేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది....
New Delhi, April 20: కేంద్ర పన్నులు, సుంకాలలో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి ఏప్రిల్ నెలకు గానూ రూ .46,038 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించింది.
ఇప్పుడు విడుదల చేసిన ఈ రాష్ట్రాల వాటాను 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆయా రాష్ట్రాలకు మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది. కొత్తగా ఏర్పడిన జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ యూటీలకు సైతం కూడా రాష్ట్రాల వాటా నుంచి 1 శాతం మంజూరు చేసినట్లుగా పేర్కొంది.
ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రూ. 1892.64 కోట్లు మంజూరవగా, తెలంగాణ రాష్ట్రానికి రూ. 982 కోట్లు మంజూరయ్యాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ. 8255.19 కోట్లు మంజూరయ్యాయి, అత్యల్పంగా గోవాకు రూ. 177.72, ఇదే కోవలో సిక్కిం రాష్ట్రానికి రూ. 178.64 కోట్లు మంజూరయ్యాయి.
రాష్ట్రాల వారీగా మంజూరైన నిధుల వాటా వివరాలు ఇలా ఉన్నాయి:
దేశంలో COVID-19 మహమ్మారి కారణంగా ఉత్పన్నమవుతున్న విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్రాలకు సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో ఎలాంటి కోతలు లేకుండా అందజేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇండియా కొత్త ఎఫ్‌డీఐ రూల్స్, ఆవేశం వెళ్లగక్కిన చైనా
2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్రాల వాటాను 7.84 లక్షల కోట్ల రూపాయలుగా బడ్జెట్ అంచనా వేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆదాయం పూర్తిగా పడిపోయినప్పటికీ బడ్జెట్లో పేర్కొన్న విధంగా రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన పన్నుల నికర వాటాల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని కేంద్రం పేర్కొంది.