Fine For Defecation: షాపింగ్ మాల్ గేటు ఎదుట మలవిసర్జన, సింగపూర్ లో భారతీయుడికి భారీ జరిమానా
తెల్లవారుజామున 5 గంటలకు కెసినో నుంచి బయటకు వచ్చిన అతను కాలకృత్యాలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే మద్యం మత్తులో మరుగుదొడ్డి ఎక్కడ ఉందో గుర్తించలేకపోయాడు. చివరకు ఉదయం 7 గంటల సమయంలో అదే ఏరియాలోని ‘ది షాపీస్’ అనే స్టోర్ ఎంట్రన్స్ వద్ద మల విసర్జన చేశాడు (Fine For Defacation).
Singapore, SEP 20: సింగపూర్‌లో ఓ భారతీయ నిర్మాణరంగ కార్మికుడికి అక్కడి కోర్టు భారీ జరిమానా (Fine) విధించింది. మద్యం మత్తులో తాను ఆ తప్పు చేశానని నిందితుడు అంగీకరించడంతో అతడికి రూ.25 వేల ఫైన్ వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సింగపూర్‌లో గత ఏడాది అక్టోబర్ 30న రాత్రి రాము అనే భారత పౌరుడు పూటుగా మద్యం సేవించాడు. ఆ రాత్రంతా మెరీనా బే శాండ్స్ కెసినోలో గడిపాడు. తెల్లవారుజామున 5 గంటలకు కెసినో నుంచి బయటకు వచ్చిన అతను కాలకృత్యాలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే మద్యం మత్తులో మరుగుదొడ్డి ఎక్కడ ఉందో గుర్తించలేకపోయాడు. చివరకు ఉదయం 7 గంటల సమయంలో అదే ఏరియాలోని ‘ది షాపీస్’ అనే స్టోర్ ఎంట్రన్స్ వద్ద మల విసర్జన చేశాడు (Fine For Defacation). దాంతో ఈ ఘటనపై విచారణ జరిపిన సింగపూర్ కోర్టు నిందితుడికి భారీ జరిమానా విధించింది.
రాము బహిరంగ ప్రదేశంలో మల విసర్జన చేశాడని కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించాడు. తన పని ముగించుకున్నాక అక్కడి నుంచి క్రాంజీలోని తన నివాసానికి వెళ్లాడని తెలిపారు. ఆ తర్వాత సింగపూర్ నుంచి భారత్‌కు వచ్చిన అతడు మళ్లీ జూన్ 4న వెళ్లాడు. మరోసారి అతడు కెసీనోలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా సిబ్బంది గుర్తుపట్టారు. అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనపై విచారణ సందర్భంగా.. నిందితుడికి గరిష్ఠ జరిమానా విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. అతడు దాదాపు 10 నిమిషాల పాటు బయటే ఉన్నాడని, ఇది సాధారణ విషయం కాదని అన్నాడు. నిందితుడు మాత్రం తాను మద్యం మత్తులో తప్పు చేశానని, స్వల్ప జరిమానా విధించాలని కోరాడు. దీనిపై న్యాయమూర్తి ఘాటుగా స్పందించారు. ‘ఇలాంటి తప్పు పునరావృతమైతే జరిమానా మరింత ఎక్కువ ఉంటుందన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు’ అని నిందితుడికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.