Srisailam Fire Accident: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం, మంటల్లోనే చిక్కుక్కున్న పలువురు సిబ్బంది, రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్న రెస్క్యూ టీమ్స్
వీరిలో 15 మంది అత్యవసర సొరంగ మార్గం ద్వారా బయటకు రాగా, మరో ఆరు మందిని రెస్క్యూ టీమ్ రక్షించింది. మిగతా 9 మంది లోపలే చిక్కుకుపోయినట్లు సమాచారం....
Srisailam, August 21: తెలంగాణ వైపు ఉండే శ్రీశైలం ఆనకట్ట ఎడమ ఒడ్డున గల భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ కేంద్రంలోని యూనిట్ 4లో పేలుడు సంభవించింది, షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్యానెల్ బోర్డుల్లో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఘటనాస్థలంలో సుమారు 30 మంది సిబ్బంది ఉన్నట్లు చెబుతున్నారు. వీరిలో 15 మంది అత్యవసర సొరంగ మార్గం ద్వారా బయటకు రాగా, మరో ఆరు మందిని రెస్క్యూ టీమ్ రక్షించింది. మిగతా 9 మంది లోపలే చిక్కుకుపోయినట్లు సమాచారం. వీరిని రక్షించేందుకు భద్రతా సిబ్బంది అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని యూనిట్లలో దట్టమైన పొగ అలుముకోవడంతో లోపల ఉన్నవారికి
నాలుగో యూనిట్ టర్మినల్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర సహాయక బృందాలకు సమాచారం చేరవేశారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ మంటలను అదుపులోకి తెస్తూ, లోపల చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుఝాము వరకు మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, దట్టమైన పొగలు అన్ని యూనిట్లలో అలుముకున్నాయి. దీంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుంది.
Here's the update:
సమాచారం అందుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. లోపల 9 మంది జెన్ కో సిబ్బంది చిక్కుకుపోయినట్లు మంత్రి తెలిపారు. అందరినీ కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.