Coronavirus Positive: భారత్‌లో తొలి కరోనావైరస్ కేసు నమోదు, వైద్య పరీక్షలలో కేరళ విద్యార్థికి పాజిటివ్, త్రిపురకు చెందిన ఒక వ్యక్తి మృతి, ఏపీలోనూ ఓ అమ్మాయికి వైద్య పరీక్షలు

అతణ్ని ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి, చికిత్స అందిస్తున్నాము. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది " అని గురువారం ఒక మీడియా ప్రకటనలో వెల్లడించారు.....

Coronavirus Screening | (Photo Credits: AFP)

New Delhi, January 30:  భారతదేశంలో కరోనావైరస్ (Coronavirus) యొక్క తొలి కేసును ఆరోగ్య అధికారులు నిర్ధారించారు. చైనాలోని వుహాన్ విశ్వవిద్యాలయంలో (Wuhan University Student) చదువుతున్న కేరళకు చెందిన ఒక విద్యార్థికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కరోనావైరస్ పాజిటివ్ (Coronavirus Positive) గా నిర్ధారించబడింది. ఈ విషయాన్ని  వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. ప్రాణాంతక కరోనావైరస్ బారిన పడి, స్వస్థలం (Kerala) తిరిగి వచ్చిన ఆ విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు. వైద్యాధికారులు రోగి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు.

చైనా దేశంలోని వుహాన్‌ నగరంలో పుట్టిన ఒక రకమైన ఫ్లూ లాంటి ఈ వైరస్, చైనా నుంచి ఇతర దేశాలకూ వ్యాపిస్తుంది. 17 దేశాలలో  ఇప్పటికే వేలాది మందికి ఈ వైరస్ సోకింది, ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఈ వైరస్ బారిన పడి 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడించాయి.  కరోనావైరస్ గుట్టు విప్పేశారు, షాకింగ్ నిజాలు బట్టబయలు

కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ మాట్లాడుతూ "వుహాన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఓ విద్యార్థికి నోవెల్ కరోనావైరస్ పాజిటివ్ వైద్య రిపోర్ట్ పేర్కొంది. అతణ్ని ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి, చికిత్స అందిస్తున్నాము. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది " అని గురువారం ఒక మీడియా ప్రకటనలో వెల్లడించారు.

రోగికి నిర్వహించిన 20 రకాల రక్త పరీక్షల నమూనాలను ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖకు పంపించినట్లు మంత్రి తెలిపారు. అలాగే ఇలాంటి రోగ లక్షణాలతో వచ్చే రోగులను వేరుగా, ప్రత్యేకంగా చికిత్స అందించాలని, అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు ఆదేశాలు జారీచేసినట్లు చెప్పారు.  తెలంగాణలో ఒక్క కరోనవైరస్ కేసు కూడా నమోదు కాలేదు, పుకార్లను నమ్మొద్దు

అలాగే త్రిపుర రాష్ట్రానికి చెందిన మనీర్ హుస్సేన్ అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం 2018లో మలేషియా వెళ్లాడు. ఆయన కరోనావైరస్ బారిన పడి మరణించారని మలేషియా అధికారులు ఫోని చేసి చెప్పినట్లు అతడి బంధువులు తెలిపారు. దీనిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, అవనిగడ్డకు చెందిన ఓ విద్యార్థిని చైనాలో ఎంబీబీఎస్ చేస్తుంది. ఆమె స్వస్థలం తిరిగి రావటంతో అప్రమత్తమైన అధికారులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రిపోర్టుల్లో నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif