Buddhadeb Bhattacharjee: బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య ఇకలేరు, అనారోగ్యంతో మృతి,జ్యోతిబసు తర్వాత 11 ఏళ్ల పాటు బెంగాల్ సీఎంగా సేవలు
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. బుద్దదేవ్ వయస్సు 80 ఏళ్లు. దివంగత సీపీఎం లెజండరీ నేత జ్యోతిబసు తర్వాత బెంగాల్‌కు సీఎంగా సేవలు అందించారు భట్టాచార్య. 11 ఏళ్ల పాటు బెంగాల్ సీఎంగా 2000 నుంచి 2011 వరకు చేశారు.
West Bengal, Aug 8: సీపీఎం సీనియర్ నేత, బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. బుద్దదేవ్ వయస్సు 80 ఏళ్లు. దివంగత సీపీఎం లెజండరీ నేత జ్యోతిబసు తర్వాత బెంగాల్‌కు సీఎంగా సేవలు అందించారు భట్టాచార్య. 11 ఏళ్ల పాటు బెంగాల్ సీఎంగా 2000 నుంచి 2011 వరకు చేశారు.
బెంగాల్‌కు ఆరవ సీఎంగా పనిచేశారు. తన తండ్రి బుద్దదేవ్ మరణించినట్లు కుమారుడు సుచేతన్ భట్టాచార్య అఫిషియల్‌గా ప్రకటించారు. 34 ఏళ్ల పాటు బెంగాళ్‌ను కమ్యూనిస్టులు ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. ఇక బెంగాల్‌కు కమ్యూనిస్టు చివరి సీఎంగా పనిచేశారు.
శ్వాసకోస వ్యాధితో కొంతకాలంగా ఆయన బాధపడుతుండగా ఇవాళ ఉదయం 8.30 గంటలకు కోల్‌కతాలోని పామ్ అవెన్యూలో ప్రాణాలు విడిచారు. దేశవ్యాప్తంగా 73 లక్షల మొబైల్ కనెక్షన్లు రద్దు.. కారణం ఏమిటంటే?
Here's Tweet:
బుద్దదేవ్ భట్టాచార్య మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి బుద్దదేవ్ మరణం తనను కలచివేసిందని వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబసభ్యులు, అభిమానులకు సంతాపం తెలిపారు.
Here's Tweet: