Azharuddin: భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ ప్రయాణిస్తున్న కారు బోల్తా, ప్రమాదంలో అజర్‌కు గాయాలు, క్షేమంగానే ఉన్నారని వ్యక్తిగత సహాయకుడి వివరణ
అయితే హైవేకి పక్కన ఉండే దాబాలోకి కారు దూసుకురావడంతో దాబాలో పనిచేసే ఓ వ్యక్తికి కూడా గాయాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదం తర్వాత అజర్ ను మరొక కారులో అక్కణ్నించి తరలించారు....
Jaipur, December 30: భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ కారు ప్రమాదానికి గురైంది. అజర్ తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం రాజస్థాన్ రాష్ట్రంలోని రణతంబోర్ కు వెళ్తుండగా సూర్వాల్ వద్ద లాల్సోట్-కోటా హైవేపై వారి కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో అజర్ మరియు కుటుంబ సభ్యులు గాయాలతో బయటపడ్డారు. పెద్ద ప్రమాదం ఏం జరగలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అజర్ వ్యక్తిగత సహాయకుడు మీడియాకు తెలిపారు.
హైవేపై టర్నింగ్ వద్ద టైరు పేలడంతో కారు ఓవర్ టర్న్ అయి అదుపుతప్పి బోల్తా పడి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే హైవేకి పక్కన ఉండే దాబాలోకి కారు దూసుకురావడంతో దాబాలో పనిచేసే ఓ వ్యక్తికి కూడా గాయాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదం తర్వాత అజర్ ను మరొక కారులో అక్కణ్నించి తరలించారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Here's the update:
అజారుద్దీన్ 99 టెస్ట్ మ్యాచ్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు లాగే ఒక దశలో సచిన్ టెండూల్కర్ కంటే ముందు వన్డే ఇంటర్నేషనల్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అజర్ 1992 నుండి 1999 వరకు మూడు ఐసిసి ప్రపంచ కప్ లలో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు, 1996 ఎడిషన్లో జట్టును సెమీ-ఫైనల్ వరకు నడిపించాడు.
ప్రస్తుతం అజరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. గతేడాది జరిగిన అసోసియేషన్ ఎన్నికల్లో అజర్ ఘనవిజయం సాధించారు.