Rape on Monitor Lizard: ఉడుముపై సామూహిక అత్యాచారం, ఫోన్లో వీడియో తీసుకున్న నిందితులు, మహారాష్ట్ర అడవుల్లో కామాంధుల ఘాతుకం, ఏడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం, ఇదెక్కడి కక్కుర్తి బాబోయ్
వీరంతా కొంకణ్ నుంచి కొల్హాపూర్ లోని చందోలి గ్రామానికి వేటకోసం వచ్చినట్లు అటవీశాఖ అధికారుల విచారణలో తేలింది.
Maharashtra, April 14: కామాంధుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. కళ్లు మూసుకుపోతే మానవ మృగాలు జంతువులనైనా వదలిపెట్టరని మరోసారి రుజువైంది. ఇంతకు ముందు కుక్కలు, ఆవులు, ఇతర జంతువులపై కళ్లుమూసుకుపోయిన మానవ మృగాలు అత్యాచారంకు (Rape) పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. గోథానే గ్రామం సమీపంలోని సహిదరి టైగర్ రిజర్వాయర్ లో బెంగాల్ మానిటర్ బల్లి(ఉడుము) (monitor lizard) పై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారంకు పాల్పడినట్లు అటవీశాఖ అధికారులు (Forest officers) గుర్తించారు. మహారాష్ట్రలోని గోథానే గ్రామ సమీపంలోని సహిదరి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ (Sahidari reserve forest)ఉంది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ బెంగాల్ మానిటర్ బల్లుల(ఉడుము)కు ఆవాసంగా చెబుతుంటారు. సందీప్ తుక్రమ్, పవార్ మంగేష్, జనార్దన్ కమ్టేకర్, అక్షయ్ సునీల్ అనే నలుగురు వ్యక్తులు సహిదరి టైగర్ రిజర్వ్ కోర్ జోన్ లోకి ప్రవేశించారు. వీరిని సీసీ పుటేజ్ ల ద్వారా గుర్తించిన అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకొని స్థానిక స్టేషన్ కు తరలించారు. తొలుత వీరిని వేటగాళ్లుగా అధికారులు గుర్తించారు. నిందితుల వద్ద మొబైల్ ఉండటాన్ని గుర్తించిన మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకొని పరిశీలించారు. దీంతో ఒక్కసారిగా కంగుతినడం అటవీ శాఖ అధికారుల వంతైంది.
సహిదరి టైగర్ రిజర్వాయర్ లోకి ప్రవేశించిన నలుగురు వ్యక్తులు బెంగాల్ మానిటర్ బల్లి(ఉడుము) పై సామూహిక అత్యాచారంకు పాల్పడినట్లు ఫోన్ లో వీడియోను (Video in Mobile) గుర్తించారు. వీరంతా కొంకణ్ నుంచి కొల్హాపూర్ లోని చందోలి గ్రామానికి వేటకోసం వచ్చినట్లు అటవీశాఖ అధికారుల విచారణలో తేలింది.
దారుణానికి పాల్పడిన నిందితులను కోర్టులో హాజరుపర్చి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే నిందితుల నేరం కోర్టులో రుజువైతే బెంగాల్ మానిటర్ బల్లి వన్యప్రాణి సంరక్షణ చట్టం – 1972 ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష అమలయ్యే అవకాశాలు ఉన్నాయి.