Building Collapses in Delhi: కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం, శిధిలాల కింద చిక్కుకున్న కూలీలు, నార్త్ ఢిల్లీలోని సబ్జి మండి ఏరియాలో ఘటన, సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు
నార్త్ ఢిల్లీలోని సబ్జి మండి ఏరియాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
New Delhi, Sep 13: దేశ రాజధాని ఢిల్లీలో ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది ( Building Collapse in Delhi). నార్త్ ఢిల్లీలోని సబ్జి మండి ఏరియాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న మిగతావారిని (Several Feared Trapped) రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
స్థానిక పోలీసులు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ దళం అధికారులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారని ఢిల్లీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్ఎస్ బుందేలా చెప్పారు. శిథిలాల కింద ఎంత మంది ఉండవచ్చనే వివరాలు తెలియడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు. ఇప్పటివరకైతే తలకు తీవ్ర గాయమైన ఓ వ్యక్తిని రక్షించి ఆస్పత్రికి తరలించారని చెప్పారు.
Here's ANI Update
పోలీసుల కథనం ప్రకారం.. భవనంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భవనం కూలినప్పుడు లోపల కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు.ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు చురుకుగా జరుగుతున్నాయి. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే ఎనిమిది అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకున్నాయనీ, స్థానిక పోలీసులు, ఎంసీడీ, ఎన్‌డీఆర్ఎఫ్ తదితరులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని సెంట్రల్ రంగే జాయింట్ సీపీ ఎన్.ఎస్.బుందేలా తెలిపారు.